అబ్బాయిలూ జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి విటమిన్లు ఎ, సి, డి, ఇ, జింక్, ఐరన్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తినాలి తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.జుట్టు కుదుళ్లు ప్రేరేపితమై, వెంట్రుకలు బలపడతాయి. మీ జుట్టు సంరక్షణకు సహజమైన, సల్ఫేట్ లేని షాంపూలు కండీషనర్‌లను ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది జుట్టు పెరుగుదల కోసం ప్రతి 6-8 వారాలకు మీ జుట్టును కత్తిరించాలి. రెగ్యులర్ ట్రిమ్స్ జుట్టును కాపాడుతుంది. రోజ్మేరీ లేదా గ్రీన్ టీ వంటి హెర్బల్ సొల్యూషన్ తో మీ జుట్టును క్లీన్ చేస్తే, వెంట్రుక ధృడంగా మారుతుంది అధిక వేడి ఉండే హెయిర్ డ్రయర్ వంటి సాధనాలు వాడకూడదు. మీ వెంట్రుకల్ని సహజంగా ఆరనివ్వండి. ఒత్తిడి వల్ల జుట్టు రాలుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి కేశ సంరక్షణ కోసం యోగా, ధ్యానం చేయడం బెటర్ చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే వారానికి మూడు సార్లు తలస్నానం చేయాలి. జుట్టు బలంగా ఉండాలంటే ప్రొటీన్, విటమిన్ ఆహారంతో పాటు ఒత్తిడి లేని జీవనశైలి అలవాటు చేసుకోవాలి