మందార రేకులతో ఆరోగ్యానికి ఇన్ని లాభాలున్నాయా? మందారలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. పరగడుపున మందార రెక్కలు తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. పొద్దున్నే మందార రెక్కలు తినడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. మందరాలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. మందార రెక్కలు శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపుతాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. మందార రక్తహీనతను దూరం చేయడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తుంది. మందార రెక్కలు చర్మాన్ని యవ్వనంగా మార్చుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com