ఆరోగ్యవంతమైన చర్మమే మెరుపులీనుతూ అందంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి విటమిన్ K చాలా అవసరం. బ్రకోలీలో విటమిన్ K తో పాటు విటమిన్లుA,C, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు చర్మం మీద వయసు ప్రభావాన్ని తగ్గిస్తాయి. పాలకూరలో విటమిన్లు K, A, B, C తో పాటు ఫోలేట్ కూడా ఉంటుంది. ఈ ఆకుకూరతో చర్మం రంగు తేలి ప్రకాశవంతంగా తయారవుతుంది. దానిమ్మ గింజల్లో విటమిన్లు K, C ఉంటాయి. ఈ పండుతో చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. కొత్తిమీర, ఆరిగానో వంటి హెర్బ్ లలో కూడా విటమిన్ K1 ఉంటుంది. చెపలు, గింజల్లో కూడా కొద్ది మొత్తంలో విటమిన్ K ఉంటుంది. వీటిలోని ఫ్యాటీ ఆసిడ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు