మీ లవర్ లేదా పార్టనర్ మీకు మరింత దగ్గర కావాలనుకుంటే కొన్ని హ్యాక్స్ ఫాలో అవ్వాలి. ఇవి మీ రిలేషన్లో అతి ముఖ్యపాత్రను పోషించి.. మీ బంధాన్ని స్ట్రాంగ్ చేస్తాయి. మీ బిజీ టైమ్‌లో 5 నిమిషాలు తీసుకుని.. వారిని మెచ్చుకుంటూ 3 పాయింట్స్ రాసి వారికివ్వండి. రోజులో కనీసం 5 నిమిషాలు కూర్చోని మాట్లాడుకోండి. లేదంటే మీ పార్టనర్ చేతిని పట్టుకుని కబుర్లు చెప్పండి. మీ పార్టనర్ కోసం వారు ఇంట్లో ఎక్కువగా వెళ్లే ప్రదేశాల్లో స్వీట్ నోట్స్ రాసి ఉంచండి. మీ పార్టనర్ ఫీలింగ్స్‌ని, ఆలోచనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. హగ్ చేసుకోవడం, బయటకు తీసుకువెళ్లడం వంటి చిన్న చిన్న పనులు బంధాన్ని రెట్టింపు చేస్తాయి. కోపాలు, గొడవలు పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని క్షమించుకుంటే ప్రేమ అంత మీదే అవుతుంది. మీ పార్టనర్ ఏదైనా చెప్తున్నప్పుడు ఇతరపనుల్లో ఉండి కాకుండా వీలైనంత వరకు వారిని చూస్తు వినండి. ఈ చిన్న విషయాలే మీ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయి. (Images Source : Envato)