హార్ట్ హెల్తీగా ఉండాలంటే కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. ప్రాసెస్ చేసిన మీట్స్‌లో సోడియం, ప్రిజెర్వెటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సోడా, స్పోర్ట్స్ డ్రింక్స్‌లో షుగర్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మంచిది కాదు. ఎక్కువగా ఫ్రై చేసిన ఫుడ్స్‌లో కేలరీలు, అన్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్‌కి వంటి వాటికి దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే వైట్ బ్రెడ్, స్వీట్స్‌కి దూరంగా ఉంటే గుండెకు మంచిది. ఉప్పు ఎక్కువగా ఉండే సూప్స్, ప్రోసెస్ చేసిన స్నాక్స్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసి బీపిని పెంచుతాయి. లివర్, కిడ్నీ వంటి మీట్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేస్తాయి. డోనట్స్, క్యాన్డ్ వెజిటబుల్స్, మీట్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. సమతుల్య ఆహారం తీసుకుంటూ.. ఫ్రూట్స్, వెజిటెబుల్స్ తీసుకుంటే హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే హార్ట్ హెల్తీగా ఉంటుంది. (Images Source : Envato)