రాత్రిపూట జుట్టుకు నూనె రాస్తే మంచిదేనా? ఒత్తిడి, హెల్తీ ఫుడ్ తీసుకుపోకపోవడం వల్ల జుట్టు సమస్యలు ఏర్పడుతున్నాయి. జుట్టును కాపాడుకునేందుకు చాలా మంది రోజూ జుట్టుకు నూనె రాస్తారు. జుట్టుకు నూనె పెట్టడం వల్ల తలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా, నల్లగా, బలంగా పెరుగుతుంది. రాత్రి పూట జుట్టుకు నూనె పెట్టడం మంచిది కాదంటున్నారు నిపుణులు. రాత్రి నూనె పూయడం వల్ల జుట్టుతో పాటు చర్మం కూడా డ్యామేజ్ అవుతుంది. రాత్రి పూట నూనె పెట్టడం వల్ల తల స్వేదరంద్రాలు మూసుకుపోతాయి. చెమట బయటకు రాకుండా నూనె అడ్డుకోవడంతో స్కిన్ ప్రాబ్లం తలెత్తి జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com