చికెన్‌ను ఇలా తినేస్తున్నారా? జాగ్రత్త, మంచి ఉంది, చెడూ ఉంది! మీకు చికెన్ ఇష్టమా? స్కిన్‌తో ఉన్న చికెన్ ఇష్టమా లేదా స్కిన్ తీసినది ఇష్టమా? ఒకప్పుడు చికెన్‌ను చర్మంతో సహా తినడం మంచిది కాదని చెప్పేవారు. కోడి చర్మాన్ని పూర్తిగా ఒలిచిన తర్వాతే వండాలని తెలిపేవారు. అయితే, తాజా అధ్యయనం కొన్ని కీలక విషయాలు చెప్పింది. 30 గ్రాముల చికెన్ స్కిన్‌లో 8 గ్రా. అసంతృప్త కొవ్వు, 3 గ్రా. సంతృప్త కొవ్వు ఉంటుందట. అసంతృప్త కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రక్తంలోని కొవ్వును నిరోధిస్తాయి. అయితే, చికెన్ స్కిన్‌లో క్యాలరీలు ఎక్కువ. అలాగే సంతృప్త కొవ్వు ఆరోగ్యానికి హాని చేస్తుంది. చికెన్ స్కిన్ తింటే రక్తపోటు, హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం కూడా ఉందట. అలాగే చికెన్ స్కిన్‌లో ఎక్కువగా ఉండే ఒమేగా-6 వల్ల కడుపు మంట సమస్యలు వస్తాయట.