నీతా అంబానీ కూడా జ్యూవెలరీని రిపీట్ చేస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. విషయానికొస్తే నీతా అంబానీ ప్రతి వేడుకకు చాలా అందంగా ముస్తాబవుతుంది. అందుకే ఆమె డ్రెస్‌లు, జ్యూవెలరీ మంచి హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో నీతా భారీ కుందన్ డైమండ్ గోల్డెన్ హారం వేసుకుంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ గోల్డెన్ హారం, భారీ ఇయర్ రింగ్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే నీతా గతంలో ఇషా అంబానీ పెళ్లి వేడుకల్లో ఈ హారాన్ని ధరించింది. అనంత్ రాధిక మెహందీ వేడుకల సమయంలో ఇదే జ్యూవెలరీని వేసుకుందంటూ పోస్ట్‌లు వేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం పీకాక్ కలర్ చీర, గోల్డెన్ బ్లౌజ్ ధరించి.. ఈ భారీ గోల్డెన్ కుందన్ హారాన్ని పెట్టుకుంది. నీతా పెళ్లి సమయంలో ఇవే జ్యూవెలరీని పసుపు రంగు చీరకు పెయిర్ చేసింది. పాపిడి బిళ్ల కూడా పెట్టుకుంది. గతంలో కూడా నీతా అంబానీ తన జ్యూవెలరీని రిపీట్ చేసింది. (Source : Instagram)