చియా సీడ్స్‌కి సబ్జా విత్తనాలకు ఉండే డిఫరెన్స్ ఇదే.. హెల్త్ బెనిఫిట్స్ ఇవే. చియా విత్తనాలు, సబ్జా విత్తనాలు రెండూ పోషకాలతో నిండినవే. కానీ కొన్ని తేడాలుంటాయి. చియా సీడ్స్ చూసేందుకు కాస్త చిన్నవిగా, ఓవల్ ఆకారంలో ఉంటాయి. బూడిద, గోధుమ రంగులో ఉంటాయి. సబ్జా గింజలు కొంచెం పెద్దవిగా, గుండ్రంగా ఉంటాయి. తెల్లటి మచ్చతో గోధుమ, నలుపు రంగులో ఉంటాయి. చియా, సబ్జా రెండింటిల్లోనూ ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్‌లో పీచు, ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి. సబ్జా గింజల్లో ఎక్కువ కేలరీలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చియా సీడ్స్ ద్రవాన్ని గ్రహించి జెల్లాగా మారుతాయి. సబ్జాలు మరింత మృదువుగా, జెల్లా మారుతాయి. చియా తేలికపాటి రుచితో ఉంటాయి. సబ్జాలు కొద్దిగా తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. ఈ రెండు విత్తనాలు గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బరువు నిర్వహణకు తోడ్పడతాయి. చియా విత్తనాలు కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. సబ్జా గింజలు శరీరాన్ని డిటాక్స్ చేసి.. హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి అవగాహన కోసమే. (Images Source : Envato)