Image Source: pexels

టూత్ పేస్ట్‌ను క్లీనింగ్‌కు కూడా వాడేయొచ్చా? ఇదిగో ఇలా...

టూత్ పేస్టు దంతాలకే కాదు.. బట్టలపై, కిచెన్‌లోని మొండి మరకలను సైతం తొలగిస్తుంది.

టూత్ పేస్టు వంటగది క్లీనర్ గా ఉపయోగపడుతుంది. వంటగదిలో టూత్ పేస్టును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

పెనం మాడిపోతే.. దానికి కొద్దిగా టూత్ పేస్టు రాయండి. కొన్ని నిమిషాల తర్వాత స్పాంజితో శుభ్రం చేస్తే.. మరక పోతుంది.

టూత్ పేస్టు స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలపై బాగా పనిచేస్తుంది. దానిపై కొద్ద పేస్టును రుద్ది గుడ్డతో తుడిస్తే తెల్లగా మెరుస్తాయి.

కంటెయినర్లలో ఉండే టఫ్ ఫుడ్ మరకలను టూత్ పేస్టుతో తొలగించుకోవచ్చు.

కట్టింగ్ బోర్డులపై వచ్చే దుర్వాసనను తొలగించేందుకు టూత్ పేస్టును రుద్దండి. కొన్ని నిమిషాలు ఉంచి నీటితో కడగాలి.

టూత్ పేస్టును నేరుగా గ్రౌట్ లైన్స్ లపై రుద్దీ.. స్క్రైబ్ చేసి నీటితో శుభ్రం చేయాలి.

గ్రౌట్ పై ఉన్న దుమ్ము ధూళిని తొలగిస్తుంది.

Image Source: pexels

తడి గుడ్డపై పేస్టు రాసి కుళాయిలు, సింక్ లపై రుద్దండి. నీటి మరకలు తొలగిపోయి శుభ్రంగా ఉంటుంది