డైలీ ఎన్ని కప్పుల కాఫీ తాగుతున్నారు? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

కాఫీ ఆరోగ్యానికి మంచిదే. మితిమీరితే మాత్రం స్మోకింగ్ కంటే డేంజర్.

ఔనండి, తాజాగా మన భారతీయ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలోనే ఈ విషయం తెలిసింది.

కాఫీ అతిగా తాగితే గుండె సమస్యలు తప్పవని తాజా అధ్యయనం వెల్లడించింది.

జైడస్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ చేపట్టిన పరిశోధనల్లో ఈ కీలక విషయాలు తెలిశాయి.

కేవలం కాఫీ మాత్రమే కాదు, కెఫైన్ కలిగిన కూల్ డ్రింక్స్ సైతం ప్రమాదకరమేనట.

కాఫీ శరీరంలోని పరాసింపథెటిక్ సిస్టమ్‌కు అంతరాయం కలిగిస్తుందట.

అంతేకాదు, అది గుండె వేగాన్ని కూడా తగ్గిస్తుందట. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగిస్తుందట.

బ్లడ్‌ప్రెజర్, హార్ట్ ఫెయిల్యూర్, చిత్త వైకల్యం వంటి సమస్యలకు దారి తీస్తుందట.

ముఖ్యంగా డైలీ 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగేవారిలోనే ఈ సమస్యలు అధికం.