మనసులో కోరికలు వేరు.. మనిషిగా బతికేది వేరు.. అందరిది ఒకటే కథనా? కొన్ని సందర్భాల్లో మనసులో కోరికలు ఉన్నా.. వాటిని అడగలేక మౌనంగా ఉండిపోతాము. తప్పును ఒప్పుకుని.. క్షమాపణ అడగాలి అనుకుంటారు కానీ.. అడగలేకపోవడం. ఒకానొక సమయంలో ఓ వ్యక్తిపై ఇష్టమున్నా.. ఆ రిలేషన్ పాడైపోతుందని చెప్పడం మానేయడం. మానసికంగా ఇబ్బంది పడుతున్నా.. లోకువగా చూస్తారని పక్కని వాళ్లతో డిస్కస్ చేయకపోవడం. తమ టాలెంట్‌ని చూపిస్తే చులకనగా చూస్తారేమోనని అవి బయటకు చూపించ లేకపోవడం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ అంటూ బౌండరీలు గీసుకుని.. దానిలో నుంచి బయటకు రాలేకపోవడం. కంఫర్ట్ జోన్‌నుంచి కొన్ని సందర్భాల్లో బయటకు రావాలని కోరుకున్నా.. కంట్రోల్ చేసుకోవడం. ఇండిపెండెంట్‌గా ఉండడానికి చూస్తారు కానీ.. ఇంట్లోవారి కోసం బౌండరీలు దాటకపోవడం. మనసులో ఫిల్టర్ లేకుండా చెప్పాలని ఉన్నా.. జడ్జ్ చేస్తారనే భయం. ఇలాంటి భయాలు మీలో కూడా ఉన్నాయా? అయితే కాస్త వాటిని ఓవర్కామ్ చేయండి. (Images Source : Envato)