పద్దతి లేకుండా నిద్రపోతున్నారా? అయితే, డయాబెటిస్ ముప్పు తప్పదు! ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ సమస్య రోజు రోజుకు మరింత తీవ్రం అవుతోంది. ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా డయాబెటిస్ పెరుగుతోంది. పద్దతిలేని నిద్రతో కూడా డయాబెటిస్ వస్తుందంటున్నారు నిపుణులు. అతినిద్ర, నిద్రలేమి కారణంగా మధుమేహం వస్తుంది. నిద్రలేమితో రోగ నిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది. బీపీ, ఒబేసిటీ, మెంటల్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ నిద్రతో జీర్ణవ్యవస్థ పనితీరు మందగించి గ్యాస్ సహా పలు సమస్యలు ఏర్పడుతాయి. వీలైనంత వరకు రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com