ఈ నట్స్ కలిపి తింటే చికెన్ కంటే ఎక్కువ పోషకాలు మీ సొంతం జీడిపప్పు, బాదం, వాల్నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని డైట్లో చేర్చుకుంటే శారీరకంగా, మానసికంగానూ అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మూడింటిని కలిపి రోజూ తింటే చికెన్ ఉన్న ప్రొటీన్ కంటే ఎక్కువ ప్రోటీన్లు మీకు లభిస్తాయి జీడిపప్పులో మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్నాయి. మెదడుకు అవసరమైన పోషకాలు ఉన్నాయి. బాదం, వాల్నట్స్ లో విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీడిపప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వు, బాదంలో ఫైబర్, వాల్నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ మూడింటిని కలిపి తీసుకుంటే అందులోని ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇవి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడంతో దోహదం చేస్తాయి వీటిని డైట్లో చేర్చుకుంటే ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది