South Indian cuisine Nethi Bobbatlu Recipe : ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెసిపీ.. భక్ష్యాలను టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా
Nethi Bobbatlu : నేతి బొబ్బట్లు ఇంట్లోనే టేస్టీగా, మెత్తగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఉగాదికి ఈ టేస్టీ ఫుడ్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Nethi Bobbatlu for Ugadi 2025 : ఉగాదికి స్పెషల్‌గా చేసే వంటల్లో బొబ్బట్లు కచ్చితంగా ఉంటాయి. అయితే వీటిని మొదటిసారి తయారు చేయాలనుకున్నా.. నేతి బొబ్బట్లను టేస్టీగా, మెత్తగా, సాగకుండా రావాలంటే ఈ టేస్టీ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. మరి ఈ పండుగకి నేతి బొబ్బట్లు తయారు చేయాలనుకుంటే ఏ పదార్థాలు కావాలో.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
- శనగపప్పు - 1 కప్పు
- నీళ్లు - ఒకటిపావు కప్పు
- పసుపు - చిటికెడు
- ఉప్పు - చిటికెడు
- నెయ్యి - 1 టీస్పూన్
- మైదా పిండి - ఒకటిన్నర కప్పు
- గోధుమ పిండి - అర కప్పు
- నెయ్యి - 3 టేబుల్ స్పూన్ నెయ్యి
- ఉప్పు - చిటికెడు
- పసుపు - పావు టీస్పూన్
- నీళ్లు - సరిపడా
- నెయ్యి - 1 టీస్పూన్
- బెల్లం - 1 కప్పు (తురుము)
- నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి - అర టీస్పూన్
- బటర్ పేపర్ - 2
తయారీ విధానం
ముందుగా శనగపప్పును బాగా కడిగి గంట నానబెట్టుకోవాలి. అనంతరం దానిని కుక్కర్లో వేసి నీళ్లు, పసుపు, ఉప్పు, నెయ్యి వేసి ఉడికించుకోవాలి. కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి.. తర్వాత దించేయాలి. శనగపప్పు ఉడికేలోపు పిండిని తయారు చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి తీసుకోవాలి. ఇలా గోధుమ పిండి కలుపుకోవడం వల్ల బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా సాగకుండా ఉంటాయి. ఇప్పుడు దానిలో రెండు టీస్పూన్ల నెయ్యి, ఉప్పు, రంగు కోసం పసుపు వేసి బాగా కలపాలి. పిండికి సరిపడా నీళ్లు పోస్తూ.. చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిపై కాస్త నెయ్యిని అప్లై చేసి మూతవేసి పక్కన పెట్టుకోవాలి.
కుక్కర్లోని ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి.. శనగపప్పును వేరొక గిన్నెలోకి నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. అలా వడకట్టిన శనగపప్పును పది నిమిషాలు ఉంచితే పూర్తిగా డ్రై అవుతుంది. దీనిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మొత్తం శనగపప్పును మిక్సీ చేసుకుని.. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టుకోవాలి. దానిలో బెల్లం తురుము వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కరిగి.. చిక్కటి పాకంగా వచ్చిన తర్వాత.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దను వేసి బాగా కలపాలి. పాకం అంతా బాగా కలిసేలా కలుపుతూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి.. బాగా మిక్స్ చేయాలి.
శనగపప్పు మిశ్రమం పాన్‌కి వదులుతూ.. దగ్గరగా అవుతుంది. మిశ్రమం మొత్తం పాన్‌కి వదిలిపోతున్నప్పుడు స్టౌవ్ ఆపేసి.. పాన్నుంచి మిశ్రమాన్ని తీసేసి గిన్నెలోకి వేసుకోవాలి. అది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసి.. ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పూర్ణంకి సమానంగా పిండిని కూడా ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని.. దానికి నెయ్యి అప్లై చేసి.. పిండిని చిన్న పూరీలుగా ఒత్తుకోవాలి. దానిలో పూర్ణం పెట్టుకుని.. మళ్లీ గుండ్రంగా చుట్టుకోవాలి.
బటర్ పేపర్‌పై ఈ మిశ్రమాన్ని పెట్టుకుని.. మరో బటర్ పేపర్‌తో కవర్ చేసి.. చపాతీ కర్రతో లేదా చేతితో బొబ్బట్టుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టుకుని.. ఈ బొబ్బట్టును నెయ్యితో వేసుకుని వేయించుకోవాలి. ఇలా రెండువైపులా నెయ్యితో బొబ్బట్టును ఫ్రై చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ. వీటిని ఉగాది స్పెషల్‌గానే కాకుండా ఇతర స్పెషల్ అకేషనల్ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు.
Also Read : ఉగాది స్పెషల్ పచ్చ కర్పూర పాయసం.. నైవేద్యంగా పెట్టుకునేప్పుడు ఇలానే చేసుకోవాలి
Ingredients
- 1 Cup శనగపప్పు
- 1.25 Cup నీళ్లు
- 1 Pinch పసుపు
- 1 Pinch ఉప్పు
- 1 Teaspoon నెయ్యి
- 1.5 Cup మైదా పిండి
- 0.5 Cup గోధుమ పిండి
- 3 Tablespoon నెయ్యి
- 1 Pinch ఉప్పు
- 1 Pinch పసుపు
- 0.5 Cup నీళ్లు
- 1 Teaspoon నెయ్యి
- 1 Cup బెల్లం
- 3 Tablespoon నెయ్యి
- 0.5 Teaspoon యాలకుల పొడి
- 2 Piece బటర్ పేపర్
Cooking Instructions
శనగపప్పును గంటనాన బెట్టి ఉప్పు, పసుపు, నెయ్యి వేసి కుక్కర్లో మూడు విజిల్స్ ఉడికించుకోవాలి.

మైదాపిండి, గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, పసుపు వేసి పిండిలో నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.

శనగపప్పులో నీరు వేరు చేసి దానిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి.

బెల్లం కరిగిన తర్వాత శనగపప్పు మిశ్రమాన్ని వేసి నెయ్యి వేస్తూ బాగా ఉడికించాలి.

ఇప్పుడు చపాతీ పిండిని పూరీలా చేసుకుని దానిలో పూర్ణం ఉంచి.. చపాతీలుగా ఒత్తుకోవాలి.

పాన్‌పై నెయ్యి వేసి.. ఈ బొబ్బట్లను రెండువైపులా రోస్ట్ చేసుకుంటే నేతి బొబ్బట్లు రెడీ.

Summary
Nethi Bobbatlu Recipe : ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెసిపీ.. భక్ష్యాలను టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా
Nethi Bobbatlu : నేతి బొబ్బట్లు ఇంట్లోనే టేస్టీగా, మెత్తగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఉగాదికి ఈ టేస్టీ ఫుడ్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Ingredients
- 1 Cup శనగపప్పు
- 1.25 Cup నీళ్లు
- 1 Pinch పసుపు
- 1 Pinch ఉప్పు
- 1 Teaspoon నెయ్యి
- 1.5 Cup మైదా పిండి
- 0.5 Cup గోధుమ పిండి
- 3 Tablespoon నెయ్యి
- 1 Pinch ఉప్పు
- 1 Pinch పసుపు
- 0.5 Cup నీళ్లు
- 1 Teaspoon నెయ్యి
- 1 Cup బెల్లం
- 3 Tablespoon నెయ్యి
- 0.5 Teaspoon యాలకుల పొడి
- 2 Piece బటర్ పేపర్
Main Procedure
శనగపప్పును గంటనాన బెట్టి ఉప్పు, పసుపు, నెయ్యి వేసి కుక్కర్లో మూడు విజిల్స్ ఉడికించుకోవాలి.
మైదాపిండి, గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, పసుపు వేసి పిండిలో నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
శనగపప్పులో నీరు వేరు చేసి దానిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి.
బెల్లం కరిగిన తర్వాత శనగపప్పు మిశ్రమాన్ని వేసి నెయ్యి వేస్తూ బాగా ఉడికించాలి.
ఇప్పుడు చపాతీ పిండిని పూరీలా చేసుకుని దానిలో పూర్ణం ఉంచి.. చపాతీలుగా ఒత్తుకోవాలి.
పాన్‌పై నెయ్యి వేసి.. ఈ బొబ్బట్లను రెండువైపులా రోస్ట్ చేసుకుంటే నేతి బొబ్బట్లు రెడీ.