దాదాపు అన్ని పండుగల సమయాల్లో దేవుడికి ప్రసాదంగా పాయసం పెడుతూ ఉంటారు.

ఈ పాయసాన్ని బియ్యంతో లేదా సేమియాలతో ఎక్కువగా చేసి నైవేద్యంగా పెడతారు.

ముందుగా పాలను బాగా కాచి.. దానిలో ముందుగా సిద్ధం చేసిన బియ్యం లేదా సేమియా వేసుకుంటారు.

అవి బాగా ఉడికిన తర్వాత వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి వేసి మరింత దగ్గరగా అయ్యేలా చేస్తారు.

అన్ని ఉడికాయి అనుకున్నప్పుడు బెల్లం లేదా పంచదార వేసి మరికొంత సేపు ఉడికిస్తారు.

అంతే టేస్టీ పాయసం రెడీ అయిపోయినట్లే. దీనిని వేడిగా తిన్నా, చల్లగా తిన్నా మంచిదే.

ప్రసాదంగా పెట్టేప్పుడు లేదా మీరు తినాలనుకున్నప్పుడు నచ్చిన డ్రైఫ్రూట్స్ వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు.

బెల్లం పాయసం, సగ్గుబియ్యం పాయసం, శెనగ పాయసం, సేమ్యా పాయసం ఇలా ఎన్నో రెసిపీలు అందుబాటులో ఉన్నాయి.

రుచికి తగ్గట్లు లేదా సందర్భానికి తగ్గట్లు వీటిలో ఏదొ ఒకటి చేసుకోవచ్చు.

వండుకునే సందర్భం, తినేవారిని బట్టి కొలతలు చూసుకుని వేసుకుంటే మంచిది.