KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP Desam
కేఎల్ రాహుల్, అతియా శెట్టి పాపకు జన్మనిచ్చారు. బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్ అని అతియా అండ్ రాహుల్ అని రాహుల్ ఓ పోస్టర్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాస్తవానికి లక్నో సూపర్ జెయింట్స్ మీద ఢిల్లీ తరపున మ్యాచ్ ఆడాల్సి ఉన్నా అతియా కోసం ఆసుపత్రిలోనే ఉండిపోయారు రాహుల్. పాప పుట్టిందన్న శుభవార్త షేర్ చేసుకున్న కాసేపటికే రాహుల్ మరో గుడ్ న్యూస్ కూడా విన్నాడు. అదే థ్రిల్లర్ సినిమా లాంటి మ్యాచ్ లో ఢిల్లీ సంచలన విషయం సాధించటం. అది కూడా లక్నో సూపర్ జెయింట్స్ మీద. అదేంటి లక్నో మీద గెలిస్తే అంత సంబరమెందుకు ఎందుకు అంటే. అది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. గతేడాది వరకూ లక్నో సూపర్ జెయింట్స్ కి కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ పై ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా బహిరంగంగా దూషణకు దిగటం నచ్చని రాహుల్ ఆ టీమ్ ను విడిచి పెట్టేశాడు. తీవ్ర మనస్థాపానికి లోనై లక్నో ను వదిలిపెట్టిన రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో దక్కించుకుంది. కెప్టెన్సీ కూడా చేయాలని కోరినా తను పూర్తిగా బ్యాటింగ్ మీదే కాన్సట్రేట్ చేయాలని భావిస్తున్నట్లు రాహుల్ చెప్పటంతో నాయకత్వ బాధ్యతలను అక్షర్ పటేల్ కు అప్పగించింది. ఇక LSG మీద మొదటి మ్యాచ్ అనేసరికి కేఎల్ కసితీరా ఆడి తనను అవమానించిన జట్టుపై బదులు తీర్చుకుంటాడు అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ గా రెడీ అయినా పాపకు జన్మనిచ్చిన అతియాకు తోడు ఉండాలని మ్యాచ్ కు దూరమవుతున్నట్లు రాహుల్ సమాచారం ఇచ్చాడు. టీమిండియాకు క్రికెటర్ గా గొప్ప సేవలు అందిస్తున్నా ఎప్పుడూ లైమ్ లైట్ లో లేని రాహుల్ ని కూల్ అండ్ క్లాస్ ప్లేయర్ ని అవమానించిన లక్నోను చితక్కొట్టి మ్యాచ్ గెలవటమే కాదు రాహుల్ పాపకు వెల్కమ్ గిఫ్ట్ అందించింది లక్నో సూపర్ జెయింట్స్. JFM, ఫాఫ్ డుప్లెసీ, స్టబ్స్, అశుతోష్ శర్మతో స్ట్రాంగ్ గా ఉన్న ఢిల్లీ టీమ్ రేపో ఎల్లుండో రాహుల్ కూడా జాయిన్ అయితే మరింత ధృఢంగా మారనుంది.





















