అన్వేషించండి

Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

Telangana Gurukul Admissions: వచ్చే విద్యాసంవత్సరంలో గురుకుల పాఠశాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Telangana Gurukul Admissions: తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలంగాణ గురుకుల విద్యాసంస్థలు మరో  కీలక విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించే లక్ష్యంతో నడుస్తున్న ఈ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశమని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రవేశాల ప్రక్రియ- కీలక తేదీలు 

ఈ విద్యా సంవత్సరానికి ఐదో తరగతితోపాటు ఆరో తరగతి నుంచి 9 వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 

విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం:- జనవరి 11, 2026

దరఖాస్తుకు చివరి తేదీ:- జనవరి 22, 2026 

ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22, 2026

పరీక్ష సమయం: ఉదయం 11 గంట నుంచి మధ్యాహ్నం నుంచి 1 గంట వరకు

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కేవలం రూ. 100 చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పరీక్షను అన్ని జిల్లా కేంద్రాల్లో, ఎంపిక చేసిన కొన్ని ముఖ్య కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. 

ప్రత్యేక పాఠశాలలపై దృష్టి 

సాధారణ గురుకుల పాఠశాలలతోపాటు, కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన పాఠశాలల్లో కూడా ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్‌ వర్తిస్తుంది. ముఖ్యంగా రక్షణ రంగంపై ఆసక్తి ఉన్న వారికి, కళారంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుకునే వారికి ఇవి వరం లాంటివి. 

సైనిక్‌ స్కూల్స్‌: జగద్గిరిగుట్టలోని సైనిక్‌ స్కూల్‌(బాలికల కోసం), రుక్మాపూర్‌లోని సైనిక్‌స్కూల్‌(బాలుర కోసం) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

ఫైన్‌ ఆర్ట్స్‌ స్కూల్స్: మల్కాజ్‌గిరిలోని ఫైన్‌ ఆర్ట్స్ స్కూల్స్‌లో బాలురు, బాలికల కోసం ఆరో తరగతి ప్రవేశాల కల్పిస్తున్నారు. 

ఈ ప్రత్యేక పాఠశాలలు కేవలం చదువు మాత్రమే కాకుండా, విద్యార్థుల్లోని ప్రత్యేక ప్రతిభను వెలికితీస వారిని భవిష్యత్‌ నాయకులుగా తీర్చిదిద్దుతాయి. 

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం 
  • ఆధార్ కార్డు 
  • జనన ధ్రువీకరణ పత్రం 
  • పాస్‌పోర్ట్ సైజ్‌ ఫొటో
  • మొబైల్‌ నెంబర్‌ 

తెలంగాణ గురుకులాలు నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఇక్కడ చదువుతున్న చాలా మంది విద్యార్థులు ఐఐటీ ఎన్‌ఐటీ, ఎంబీబీఎస్‌ సీట్లు సాధించి రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడలు, యోగా, సంగీతం, నాయకత్వ లక్షణాలు పెంచుకొని ఈ పాఠశాలలు ముందున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget