అన్వేషించండి

School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

మురసు తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో సోమవారం నాడు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మురసు తుపానుతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సెలవులు ప్రకటించారు.
  • నవంబర్ 2న పాఠశాలలు, కళాశాలలకు సెలవు అమలు.
  • తుపాను తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం.
  • విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Holiday for SchoolsDue to Murasu Cyclone | అమరావతి: ఇటీవల అర్నబ్ తుపాను విధ్వంసం సృష్టించగా తాజాగా మురసు తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. దాంతో ఏపీలో పలు జిల్లాల్లో సోమవారం నాడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి నవంబర్ 3 తెల్లవారుజాము వరకు కృష్ణా, ఎన్టీఆర్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లేకపోతే సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మురసు తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా నవంబర్‌ 2న కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

తుపాను కారణంగా ప్రకటించిన ఈ స్థానిక సెలవును రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేయడం ద్వారా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఉత్తర్వులను కృష్ణా జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ ఈఓలు, మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓలు) తప్పనిసరిగా అమలు చేయాలని డీఈఓ సూచనలు జారీ చేశారు.

నేడు విద్యాసంస్థలకు సెలవు.. కలెక్టర్ ఆదేశాలు

కనకదుర్గమ్మ నెలవైన విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మురసు తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా నవంబర్‌ 2న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు. కేవలం పాఠశాలలకే కాకుండా జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థుల భద్రత ప్రాధాన్యతగా తీసుకుని కలెక్టర్ ఈ నిర్ణయం ప్రకటించారు. జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించి విద్యాసంస్థలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తగిన అప్రమత్తతతో ఉండాలని ఆయన సూచించారు.

 

Frequently Asked Questions

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఎందుకు సెలవు ప్రకటించారు?

మురసు తుపాను తీవ్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏ జిల్లాలకు, ఏ తేదీన సెలవు ప్రకటించారు?

కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో నవంబర్ 2న పాఠశాలలకు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

ఎన్టీఆర్ జిల్లాలో ఏయే విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది?

ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, డిగ్రీ కాలేజీలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ సెలవు వర్తిస్తుంది.

ఈ స్థానిక సెలవును ఎలా భర్తీ చేస్తారు?

మురసు తుపాను కారణంగా ప్రకటించిన ఈ స్థానిక సెలవును రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేయడం ద్వారా భర్తీ చేస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget