ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
సెప్టెంబర్ 2025లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ రోజు టీమ్ ఇండియా ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది. అప్పటి నుంచి ఈ ట్రోఫీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆసియా కప్ జరిగి ఇన్ని నెల్లలు గడుస్తున్నా ఇండియాకు మాత్రం ఇంకా ట్రోఫీ అందలేదు. ఈ విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అయితే రీసెంట్ ఆసియా కప్ ట్రోఫీ గురించి మొహ్సిన్ నఖ్వీ మాట్లాడాడు. “ట్రోఫీ ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు. ఈ ట్రోఫీని దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ కాంప్లెక్స్‌లో ఉన్న ఏసీసీ కార్యాలయంలో భద్రంగా ఉంచారని తెలుస్తుంది. నఖ్వీ స్వయంగా తన చేతులతోనే భారత్‌కు ట్రోఫీ ఇవ్వాలని పట్టుబడుతుండగా, అతని చేతుల మీదుగా తీసుకోవడానికి టీమ్ ఇండియా సిద్ధంగా లేదు. మరి ఈ వివాదం అప్పుడు సర్దుకుంటుందో చూడాలి.





















