Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
Harish Shankar : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ మూవీకే హైలెట్ అన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. దీంతో హైప్ పదింతలు అవుతోంది.

Harish Shankar About Pawan Kalyan Ustaad Bhagat Singh : 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫెర్ఫార్మెన్స్ బద్దలైపోద్దని అన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. 'కాలరే ఎత్తరా' సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పవన్ రోల్, మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
థియేటర్స్ దద్దరిల్లుతాయ్
ఈ మూవీకి పవన్ కల్యాణ్ ప్రాణం పెట్టి పని చేశారని... సెకండాఫ్‌లో వచ్చే ఇంటెన్స్ సీన్‌లో పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని చెప్పారు హరీష్ శంకర్. 'పవన్ కల్యాణ్ గారు షూటింగ్ సెట్‌లో వందల మందితో డ్యాన్స్ చేస్తుంటే అంతా దద్దరిల్లిపోయింది. ఆయన ప్రాణం పెట్టి పని చేశారు. అందుకే నేను ప్రతీసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది అని చెప్తున్నా. ఎలివేషన్ డైలాగ్స్ కోసమో, ఫైట్స్ కోసమే నేను చెప్పడం లేదు.
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ హైలెట్. ప్రతీ సాంగ్‌కు దేవిశ్రీ బీట్స్ అదిరిపోయాయ్. టైమ్ లైన్ మ్యాచ్ కాకపోవడం వల్లే బీజీఎం థమన్ చేస్తున్నారు. మైత్రీ లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం నా అదృష్టం.' అంటూ చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఈలలు, కేకలతో జోష్ పెంచేశారు.
Also Read : అది చూసి ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం - 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' ప్రచారంపై జీవిత రియాక్షన్
రాశీ ఖన్నాతో స్టెప్పులు
ఆ తర్వాత హీరోయిన్ రాశీ ఖన్నాతో డైరెక్టర్ హరీష్ శంకర్ కాలరే ఎత్తరా సాంగ్‌కు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రెండింగ్‌లో కాలరే ఎత్తరా...
ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ కాలరే ఎత్తరా ట్రెండ్ అవుతోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా మాస్ బీట్ అదిరిపోయింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా... రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బీట్స్ వేరే లెవల్. ఈ పాటను రామ్ మిర్యాల పాడారు. దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్‌ను మించి ప్రతీ పవన్ అభిమాని కాలర్ ఎగరేసేలా సాంగ్ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. లిరిక్స్‌లోనే హైలెట్ ఎలివేషన్ ఇచ్చేశారు.
మరోవైపు, ట్రైలర్ టీజ్‌లో 'ఇది భగత్ గీత. దమ్మున్నోడు దాటొచ్చు' అనే డైలాగ్‌తో పవర్ హైప్ మామూలుగా క్రియేట్ కాలేదు. దీంతో ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 14న ట్రైలర్ రిలీజ్ కానుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్‌కు పవన్ రానున్నట్లు సమాచారం. ఇప్పటికే సెన్సార్ రివ్యూ పూర్తి కాగా... U/A సర్టిఫికెట్ జారీ చేశారు. మూవీ రన్ టైం 2:33:49 గంటలు. పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్, ఆన్ స్క్రీన్‌పై పవర్ స్టార్, ఆఫ్ స్క్రీన్‌పై హరీష్ శంకర్ స్టైల్ ఎలివేషన్ కనిపించిందంటూ సినిమా చూసిన వారి మాట.
పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో పార్తీబన్ విలన్ రోల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు





















