Ashutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam
నిన్న ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ చూశారు కదా. లక్నో పెట్టిన 210 పరుగుల టార్గెట్ ను ఫినిష్ చేయటం కోసం బరిలోకి దిగిన ఢిల్లీ అనూహ్యంగా 65పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆఖరి పెద్ద బ్యాటర్ అయిన ఫాఫ్ డుప్లెసీ కూడా అవుట్ అయిపోవటంతో ఢిల్లీ కంటూ ఏం మిగల్లేదు ఇంక. ట్రిస్టన్ స్టబ్స్ ఆదుకునే ప్రయత్నం చేసినా అది కూడా కాకపోవటంతో ఇక ఢిల్లీ సీన్ అయిపోయిందనే అనుకున్నారు అంతా ఆ టైమ్ లో దిగాడు అశుతోష్ శర్మ. ఐపీఎల్ ను బాగా ఫాలో అయ్యే వాళ్లకు అశుతోష్ శర్మ లాస్ట్ ఐపీఎల్లో సృష్టించిన విధ్వంసాలు గుర్తుండే ఉండాయి. పంజాబ్ తరపున ఆడుతూ అప్పటి మరో పంజాబ్ ప్లేయర్ శశాంక్ సింగ్ తో కలిసి పంజాబ్ కు అనూహ్య విజయాలు అందించాడు అశుతోష్. ముంబై మీద 28 బాల్స్ 61 కొట్టి అతిపెద్ద విజయం అందించటం కానీ...సన్ రైజర్స్ లాంటి స్ట్రాంగ్ టీమ్ మీద చివర్లో వచ్చి 15 బాల్స్ 33 పరుగులు కొట్టి గెలిపించటం కానీ ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి అశుతోష్ ఈ ఏడాది ఢిల్లీకి మారాడు. ఆక్షన్ లో తనను కొనుకున్న డీసీ జట్టు నమ్మకాన్ని నిలబెట్టేలా చితక్కొట్టి పారేశాడు అశుతోష్. అసలు ఏ మాత్రం హోప్ లేని చోట 31 బాల్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలవటమే వికెట్ తేడాతో సంచలన విజయం సాధించేలా చేశాడు. మొదటి 20 బాల్స్ లో 20 పరుగులు మాత్రమే చేసిన అశుతోష్...తర్వాత 11 బాల్స్ లో 46పరుగులు చేసి తన సత్తా ఏంటో చాటాడు. మధ్యప్రదేశ్ కు చెందిన 26 ఏళ్ల ఈ కుర్ర ఫినిషర్ శిఖర్ ధవన్ ఫైండింగ్. రెండేళ్ల క్రితం అశుతోష్ ఆడుతున్న మ్యాచ్ లు చూసిన ధవన్...ప్రీతిజింతాకు చెప్పి ఆక్షన్ లో అశుతోష్ ను కొనుగోలు చేసేలా చేశాడట. దగ్గరుండి తనే మెంటార్ గా మారి అశుతోష్ ను ఐపీఎల్ లో నిలదొక్కుకునేలా చేశాడు. గతేడాది దాదాపు అన్ని మ్యాచుల్లోనూ ఆడించాడు. అదే కృతజ్ఞతను మనసులో పెట్టుకున్నాడు. టీమ్ మారిపోయినా నిన్న మ్యాచు గెలవగానే ధవన్ స్టైల్ లో ట్రిబ్యూట్ ఇవ్వటంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని ధవన్ కు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు చెప్పాడు. డ్రెస్సింగ్ రూం కి వెళ్లి ధవన్ కు వీడియో కాల్ చేసి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అశుతోష్. మొత్తానికి అశుతోష్ శర్మ రూపంలో ఐపీఎల్ ఓ మంచి ఫినిషర్ ను ప్రొడ్యూస్ చేసింది. చూడాలి అశుతోష్ ఫ్యూచర్ లో ఏ హైట్స్ కు చేరుకుంటాడో.





















