పదమూడేళ్లకే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి... 18 ఏళ్లకు 50 ఏళ్ల సీఎంతో రెండో పెళ్లి, విడాకులు... సినిమాలు వదిలేసిన హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
South Actress: ఓ హీరోయిన్ ఇంట్లో నుండి పారిపోయి, 13 ఏళ్ళ వయసులో మొదటి పెళ్లి చేసుకుంది. రెండేళ్లకే భర్త చనిపోవడంతో 18 ఏళ్ల వయసులో 50 ఏళ్ల సీఎంను రెండో పెళ్లి చేసుకుంది. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న హీరోయిన్లు ఎంతో మంది తమ పర్సనల్ లైఫ్ లో అష్టకష్టాలను పడిన తీరును చూశాం మనం. ఈ రోజు బాలనటిగా నటించి, పెద్దయ్యాక హీరోయిన్ గా మారి సంచలనం సృష్టించిన హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. రాత్రికి రాత్రే సంచలనంగా మారిన ఈ హీరోయిన్ పర్సనల్ లైఫ్ లో థ్రిల్లర్ సినిమాల కంటే ఎక్కువగానే ట్విస్ట్ లు ఉన్నాయి. 13 ఏళ్లకే ఫస్ట్ మ్యారేజ్, భర్త చనిపోవడం, 18 ఏళ్ళకు సీఎంతో రెండవ మ్యారేజ్, అది కూడా విడాకుల బాట పట్టడం వంటివి ఈ హీరోయిన్ లైఫ్‌లో జరిగాయి. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? ఈ హీరోయిన్ మరెవరో కాదు రాధికా కుమారస్వామి.
పెళ్ళైన రెండేళ్లకే మొదటి భర్త కన్నుమూత
హీరోయిన్ రాధిక 2002లో విజయ్ రాఘవేంద్ర సరసన 'నినగగి' సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించి రాధికకు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గుర్తింపును ఇచ్చింది. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత రాధిక మణి, ఊహ్ లా లా, హుడుగిగాగి, థాయ్ ఇల్లడ తబ్బలి, మనే మగలు, అయ్యర్కై, ఆటో శంకర్, తవారిగే బా తంగి, హతవాది, ఉల్లా కడతల్ వంటి చిత్రాలతో సహా పలు కన్నడ, తమిళం, తెలుగు సినిమాలలో నటించారు. భద్రాద్రి రాముడు, అవతారం అనే తెలుగు సినిమాలలో సైతం ఈ అమ్మడు మెరిసింది.
రాధిక కెరీర్ పీక్స్ కు చేరుకుంటున్న సమయంలోనే, ఆమె వ్యక్తిగత జీవితం గందరగోళంగా మారింది. 2000 సంవత్సరంలో రాధిక వయసు 13 ఏళ్లు. ఆ టైమ్ లో ఆమె తన ఇంటి నుండి పారిపోయి వ్యాపారవేత్త రతన్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. కన్నడ మీడియా కథనం ప్రకారం రాధిక తండ్రికి ఆమె చేసుకున్న ఈ లవ్ మ్యారేజ్ అస్సలు ఇష్టం లేదు. దీంతో రాధిక తండ్రి ఆమెను కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ రతన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లిని రద్దు చేయాలని కోర్టు మెట్లు ఎక్కింది. అయితే విషాదకరంగా పెళ్ళైన రెండేళ్లకే రతన్ గుండెపోటుతో మరణించాడు.
రెండవసారి ముఖ్యమంత్రితో పెళ్లి
రాధిక మళ్ళీ 2007లో వివాహం చేసుకుంది. కానీ ఈసారి కూడా తండ్రి ఆమె రెండవ పెళ్లిని అంగీకరించలేదు. మాజీ భారత ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామిని రాధిక వివాహం చేసుకుంది. ప్రస్తుతం భారతదేశ భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిగా ఉన్న హెచ్డీ కుమారస్వామి గతంలో కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ దంపతులకు షమిక అనే కుమార్తె కూడా ఉంది. అయితే 2006 లోనే వీరిద్దరూ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. అప్పట్లో 18 ఏళ్ల ఈ హీరోయిన్ 50 ఏళ్ల ముఖ్యమంత్రిని పెళ్లాడడం అనేది సంచలనం సృష్టించింది. కానీ ఈ జంట వైవాహిక బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. 2015లో రెండవ భర్తతో విడిపోయింది రాధిక.
రెండవ వివాహం చేసుకోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. అలాగే విడాకుల తరువాత రాధిక 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి, 2013లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ హీరోయిన్ గా కాదు నిర్మాతగా. 2012లో రాధిక తన కుమార్తె పేరు మీద షమికా ఎంటర్ప్రైజెస్ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించింది. ఇప్పుడు ఆమె రూ. 124 కోట్ల ఆస్తులకు వారసురాలు.





















