Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
New Kia Seltos | కియా సెల్టోస్, టాటా సియెరా రెండూ ఒకే సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంటాయి. లుక్, ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీలో ఏది మెరుగైనదో ఇక్కడ తెలుసుకోండి.

కియా ఇండియా కంపెనీ తన సరికొత్త రెండో తరం సెల్టోస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తరువాత టాటా మోటార్స్ సూతం కొత్త సియెరా గ్లోబల్ ప్రీమియర్‌ను ఆవిష్కరించడంతో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో గట్టి పోటీ నెలకొంది. కొత్త కియా సెల్టోస్ భారతదేశంలో జనవరి 2న విడుదల అయింది. ఇది నేరుగా టాటా సియెరాతో పోటీ పడుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది మెరుగైనదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
సైజు, బూట్ స్పేస్‌లో ఎవరు ముందున్నారు?
కొత్త కియా సెల్టోస్ మునుపటి కంటే పెద్దదిగా కనిపిస్తుంది. దీని వీల్‌బేస్ ఇప్పుడు 2690mm, బూట్ స్పేస్ 447 లీటర్లుగా ఉంది. మరోవైపు, టాటా సియెరా పొడవులో కొంచెం చిన్నదిగా ఉన్నప్పటికీ, వెడల్పు, ఎత్తు, వీల్‌బేస్‌లో కియా సెల్టోస్‌ను అధిగమిస్తుంది. సియెరా వీల్‌బేస్ 2730 mm, బూట్ స్పేస్ 622 లీటర్లు. ఇది ఫ్యామిలీ జర్నీకి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
డిజైన్‌లో రెండింటిది విభిన్న శైలి
కొత్త సెల్టోస్ లుక్ మరింత షార్ప్‌గా, మోడ్రన్‌గా ఉంది. ఇందులో కియా పెద్ద SUV టెల్లరైడ్ ఛాయలు కనిపిస్తాయి. ఇందులో కొత్త గ్రిల్, LED లైట్లు, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మరోవైపు, టాటా సియెరా డిజైన్ మరింత బోల్డ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఎత్తైన బోనెట్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ LED లైట్లు సియోరాను మరింత ప్రీమియంగా మారుస్తాయి. డిజైన్ పరంగా రెండు SUVలు ఆకర్షణీయంగా ఉన్నాయి. దాంతో ఈ విషయంలో పూర్తిగా వ్యక్తిగత ఛాయిస్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇంటీరియర్, ఫీచర్లలో సియెరా ముందుంది
ఫీచర్ల విషయంలో కొత్త కియా సెల్టోస్ చాలా బలంగా కనిపిస్తోంది. ఇందులో పెద్ద స్క్రీన్, బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. కానీ టాటా సియెరా ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఇందులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, JBL సౌండ్ సిస్టమ్, HUD, ఎయిర్ ప్యూరిఫైయర్, మరిన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇవి సియోరాను మరింత ఫ్యూచర్ రెడీగా చేస్తాయి.
ఇంజిన్ ఆప్షన్లలో తేడా ఏమిటి?
కియా సెల్టోస్, టాటా సియోర్రా రెండు SUVలలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త సెల్టోస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరింత శక్తివంతమైనది. అయితే సియెరా TGDi పెట్రోల్ ఇంజిన్ కూడా మంచి పనితీరును కలిగి ఉంది. రోజువారీ ప్రయాణానికి రెండూ మంచి ఎంపికలే. మీకు ఎక్కువ ఫీచర్లు, పెద్ద క్యాబిన్, ప్రీమియం అనుభూతి కావాలంటే టాటా సియెరా మెరుగైన ఆప్షన్ కావచ్చు. మరోవైపు, స్టైల్, బ్రాండ్, మెరుగైన పనితీరు కోసం కొత్త కియా సెల్టోస్ కారు కొనుగోలు చేయవచ్చు. .






















