పాపులర్ రేంజ్ రోవర్ కారు EMI ఎంత పడుతుంది, ఫైనాన్స్ ప్లాన్ ఇదీ

Published by: Shankar Dukanam

రేంజ్ రోవర్ ఒక పవర్ ఫుల్ కారు. ఇది పెట్రోల్, డీజిల్ రెండు పవర్ట్రెయిన్ ఎంపికలలో వస్తుంది.

రేంజ్ రోవర్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ 3.0 లీటర్ LWB ఆటోబయోగ్రఫీ (పెట్రోల్) వేరియంట్.

రోవర్ రేంజ్ రోవర్ LWB ఆటోబయోగ్రఫీ మోడల్ ధర 2.57 కోట్ల రూపాయలుగా ఉంది.

ల్యాండ్ రోవర్ కారు కొనడానికి వ్యక్తి సిబిల్ స్కోర్, ఆదాయాన్ని బట్టి 2.31 కోట్ల వరకు రుణం లభించవచ్చు.

రేంజ్ రోవర్ కొనడానికి మీరు 25.67 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చేయాలి.

రేంజ్ రోవర్ కారును 4 సంవత్సరాల లోన్ పై 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 5.75 లక్షలు EMI చెల్లించాలి.

రేంజ్ రోవర్ 5 సంవత్సరాల రుణానికి 9 శాతం వడ్డీతో 4.80 లక్షల రూపాయల ఈఎంఐ చెల్లించాలి.

ఆటోబయోగ్రఫీ మోడల్ కోసం 6 సంవత్సరాల లోన్ 9 శాతం వడ్డీతో ప్రతినెలా 4.16 లక్షలు EMI చెల్లించాలి.

భారత మార్కెట్లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మొత్తం నాలుగు మోడల్స్ అమ్ముడవుతున్నాయి.