2026 Upcoming sedan cars: వెర్నా నుండి వర్టస్ ఫేస్‌లిఫ్ట్ వరకు 2026లో ఈ లాంచ్ కానున్న సెడాన్‌ల జాబితా
2026లో భారత మార్కెట్లో కొత్త సెడాన్ కార్లు వస్తాయి. వెర్నా, వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ కొత్త డిజైన్‌తో వస్తాయి. వాటి ఫీచర్లను చూద్దాం.

భారత్‌లో SUV కార్ల డిమాండ్ వేగంగా పెరిగినప్పటికీ, సెడాన్ కార్లకు సైతం డిమాండ్ తగ్గలేదు. ముఖ్యంగా మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో ప్రజలు స్టైల్, లగ్జరీతో పాటు మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని కోరుకుంటున్నారు. ఈ ఏడాది అలాంటి కస్టమర్లకు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ సంవత్సరం అనేక పాపులర్ సెడాన్ కార్లు కొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో భారత మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో హోండా వెర్నా (Hyundai Verna), Honda City, Skoda Slavia, వోక్స్ వాగన్ వర్చూస్ (Volkswagen Virtus) వంటి ప్రముఖ కార్లు ఉన్నాయి.
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ వెర్నా ప్రస్తుత మోడల్ 2023లో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు మూడేళ్ల తరువాత 2026లో దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వస్తుందని సమాచారం. హ్యుందాయ్ కొత్త వెర్నా ముందు, వెనుక డిజైన్‌లో మార్పులు చేస్తోంది. ఇందులో కొత్త గ్రిల్, మార్పు చేసిన హెడ్‌ల్యాంప్‌లు, కొత్త టెయిల్‌ల్యాంప్‌లు ఉండవచ్చు. కారు లోపల పెద్ద టచ్‌స్క్రీన్, మరింత ప్రీమియం ఇంటీరియర్ ఇచ్చే అవకాశం ఉంది. సేఫ్టీ ఫీచర్లు, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఆప్షన్లు కూడా ఇందులో చేర్చనున్నారు. అయితే ఇంజిన్ ఆప్షన్లు మాత్రం యథాతథంగా ఉంటాయి.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్
స్కోడా స్లావియా కూడా 2026లో ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో విడుదల అవుతుంది. దీని డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. కొన్ని కొత్త ఫీచర్లు జోడించనున్నారు. ఈసారి స్కోడా కంపెనీ ఇందులో సేఫ్టీ ఫీచర్లను మరింత పెంచాలని భావిస్తోంది. దాని క్యాబిన్‌లో కూడా చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఇందులో గతంలోగే టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఇవ్వనున్నారు. ఇవి డ్రైవింగ్ లవర్స్‌కు నచ్చుతాయి.
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్
హోండా సిటీ చాలా కాలం నుంచి భారత కస్టమర్ల అభిమాన సెడాన్‌గా ఉంది. 2026లో రాబోయే దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రస్తుత జనరేషన్ చివరి పెద్ద అప్‌డేట్‌గా భావించవచ్చు. దీనికి బయట కొత్త లుక్, లోపల మెరుగైన నాణ్యతతో కూడిన ఇంటీరియర్ ఇస్తోంది. ఇంజిన్ పరంగా చూస్తే పెట్రోల్, హైబ్రిడ్ ఎంపికలు కొనసాగుతాయి. మంచి మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ హోండా సిటీ కార్లకు అతిపెద్ద గుర్తింపుగా చెప్పవచ్చు.
వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్
వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఈ సెగ్మెంట్‌లో బలమైన, నమ్మకమైన సెడాన్‌గా భావిస్తారు. 2026లో దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కొత్త డిజైన్, మరింత అధునాతన ఫీచర్లు లభించవచ్చు. మెరుగైన సేఫ్టీ, సౌకర్యవంతమైన ఇంటీరియర్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇంజిన్ ఎంపికలు గతంలోలాగే ఉంటాయి.
Also Read: Hero Splendor vs TVS Radeon: హీరో, టీవీఎస్ కంపెనీలలో ఏ బైక్ కొనడం బెస్ట్- మైలేజీ, ధర చూసి కొనండి






















