అన్వేషించండి

Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

Mahindra XUV 7xo Launched: కొత్త మహీంద్రా XUV7XO భారత మార్కెట్లో విడుదలైంది. దీని డిజైన్ బోల్డ్ గా, ఆధునికంగా ఉంది. ధర, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు తెలుసుకోండి.

Mahindra SUV XUV700 | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా తమ మిడ్-సైజ్ SUV XUV700 కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ Mahindra XUV7XO ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ SUV న్యూ లుక్, మరిన్ని ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో రిలీజ్ చేశారు. మహీంద్రా కంపెనీ పాత ఇంజిన్‌నే కొనసాగించింది. కానీ డ్రైవింగ్‌ను గతంలో కంటే మరింత స్మూత్‌గా మార్చేలా డిజైన్ చేసింది. దీని బుకింగ్ కూడా ప్రస్తుతం ప్రారంభమైంది. ఈ SUV ఫ్యామిలీ జర్నీ చేసే వారు, యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ కొత్త మోడల్ ధర, ఫీచర్లు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Mahindra XUV7XO ధర, వేరియంట్లు

మహీంద్రా కంపెనీ Mahindra XUV7XO ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 13.66 లక్షల రూపాయలుగా ఉంది. ఇది దాని బేస్ వేరియంట్ AX కోసం ఫిక్స్ చేసిన ధర. ఈ SUV AX నుండి AX7L వరకు అనేక వేరియంట్లలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఎంట్రీ ధర మొదటి 40,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని, ఆ తర్వాత ధర మారుతుందని తెలుస్తోంది.

కొత్త డిజైన్, ఆకట్టుకునే లుక్

డిజైన్ విషయానికి వస్తే XUV7XO మునుపటి కంటే మరింత బోల్డ్, మోడ్రన్‌గా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, డే-టైమ్ రన్నింగ్ లైట్లు ఇచ్చారు. ఇవి రోడ్డుపై మీ వాహనాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి. సైడ్‌లో 19 అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో స్టైలిష్ LED టెయిల్‌ల్యాంప్‌లు దీనికి ప్రీమియం SUV లాంటి లుక్‌ను తీసుకొస్తాయి. మొత్తంగా, దీని డిజైన్ ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్లేవారితో పాటు యంగ్ కస్టమర్లకు సైతం నచ్చుతుంది.

సేఫ్టీ ఫీచర్లు 

ఈ Mahindra XUV7XO SUV క్యాబిన్ పూర్తిగా టెక్నాలజీతో వచ్చింది. ఇందులో మూడు 12.3 అంగుళాల పెద్ద స్క్రీన్‌లు ఇచ్చారు. వీటిలో టచ్‌స్క్రీన్, డిజిటల్ మీటర్, ప్యాసింజర్ డిస్‌ప్లే ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, అద్భుతమైన మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ప్రయాణికుల భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఇచ్చారు.

ఎస్‌యూవీ ఇంజిన్, పనితీరు

Mahindra XUV7XO లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. రెండు ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. 15 నుండి 20 లక్షల బడ్జెట్‌లో సురక్షితమైన, ఫీచర్లతో కూడిన కారు కావాలనుకునే వారికి ఈ SUV మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. మీరు కూడా ఫీచర్లతో పాటు ధర, లుక్ గమనించిన తరువాతే కొనుగోలు చేయడం మంచిది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
How To Protect Bike During Heavy Rain:వర్షాకాలంలో మీ డ్రీమ్‌ బైక్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి?
వర్షాకాలంలో మీ డ్రీమ్‌ బైక్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget