TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Sankranti Holidays 2026 | తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పండగ లాంటి వార్త చెప్పింది. 6 రోజులపాటు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 17న స్కూల్స్ రీఓపెన్ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Sankranti Holidays 2026 for Schools | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సెలవులు(Sankranti Holidays) ను అధికారికంగా ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు,యు వాణిజ్య పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా జనవరి 16వ తేదీన రైతులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే కనుమ పండుగను పురస్కరించుకుని ఐచ్ఛిక సెలవును (Optional Holiday) కూడా ఖరారు చేసింది.
ఈ సెలవుల ప్రకటనతో విద్యార్థుల్లో పండుగ ఉత్సాహం నెలకొంది. సెలవులు ముగిసిన అనంతరం జనవరి 17వ తేదీ నుండి అన్ని పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయని సర్క్యూలర్ లో పేర్కొంది. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సెలవు తేదీలు తెలియడంతో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఏపీలో సంక్రాంతి సెలవులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు కొన్ని రోజుల కిందటే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 18 వరకు 9 రోజులు పాటు సంక్రాంతి సెలవులు అని అధికారులు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవు తేదీలు ఇవేనని స్పష్టం చేశారు. పండుగ తరువాత జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు సూచించారు.






















