Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Vijay Deverakonda Cute Moment: విజయ్ దేవరకొండ పెళ్లికి తనను పిలవలేదని ఓ క్యూట్ లిటిల్ ఫ్యాన్ వీడియో షేర్ చేసింది. సోషల్ మీడియాలో దాన్ని చూసిన విజయ్ దేవరకొండ ఇంటికి పిలుస్తానని ప్రామిస్ చేశారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి సందడి ముగిసింది. ఫిబ్రవరి 28న ఈ జంట రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఏడు అడుగులు వేయడానికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల నుంచి హైదరాబాద్ సిటీలో మార్చి 4వ తేదీ సాయంత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్ ఇవ్వడం వరకు ప్రతిరోజూ ఏదో ఒక సందడి. రిసెప్షన్ రోజున ఇక అండర్ గ్రౌండ్‌కు వెళతామని విజయ్ దేవరకొండ చెప్పారు. అయితే, ఇంకో చిన్న ట్రీట్ బ్యాలెన్స్ ఉంది. కొత్తగా ఆయన లిస్టులో యాడ్ అయ్యింది. ఒక చిన్నారి అభిమానికి ఇంటికి పిలిచి భోజనం పెడతానని విజయ్ దేవరకొండ ప్రామిస్ చేశారు.
మనం కూడా ఫ్యాన్స్... పిలిస్తే ఏమైతుంది?
'హాయ్ ఫ్రెండ్స్... విజయ్ దేవరకొండ, రష్మిక. ఇద్దరూ పెళ్లి పెళ్లయింది కదా! మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్లికి. లడ్డూలు పెడుతుండ్రు. అన్నదానం పెడుతుండ్రు. మనం కూడా ఫ్యాన్సే కదా. నేను కూడా ఫ్యాన్సే కదా. నేను కూడా రీల్స్ చేస్తున్నాను కదా. పిలిస్తే ఏమైతుంది?' అని ఒక చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది విజయ్ దేవరకొండ వరకు వెళ్ళింది. దాంతో ఆ చిన్నారి అభిమానికి విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు.
Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?
View this post on Instagram
ఇంటికి పిలుస్తా... కలిసి భోజనం చేద్దాం తల్లీ!
'బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా లంచ్ కి. నీ ఫెవరెట్ ఫుడ్ అండ్ స్వీట్స్ నాకు చెప్పు. అన్ని ఇంటిలో చేపించి మంచిగా తిందాం' అని విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. దాంతోఆ బుజ్జితల్లి ఫ్యామిలీ ఫుల్ ఖుష్ అయ్యింది. 'థాంక్యూ సో మచ్. లక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని పేర్కొంది.
Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?
పెళ్లికి ముందు 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. ఇప్పుడు 'రణబాలి' సినిమా చేస్తున్నారు. పెళ్లి సందర్భంగా ఆ సినిమాలోని సాంగ్ విడుదల చేశారు. అది కాకుండా 'రౌడీ జనార్ధన' సినిమా కూడా విజయ్ దేవరకొండ చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు



















