అన్వేషించండి

Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు

Iranian ship: ఇరాన్ యుద్ధనౌకను కాపాడటానికి భారత్ సిద్ధపడింది. కానీ వారే తొందరపడి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లిపోయారు. మరో నౌక ఇండియాలోనే సురక్షితంగా ఉంది.

Iranian ship  shelter by India:   హిందూ మహాసముద్రంలో అమెరికా జలాంతర్గామి దాడిలో ఇరాన్ యుద్ధనౌక IRIS దేనా మునిగిపోయిన ఘటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ నౌక భారత్  ఆధ్వర్యంలో విశాఖలో  నిర్వహించిన  మిలన్-2026  నావికాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా శ్రీలంక తీరానికి సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ నౌక  సమాచారం అమెరికాకు భారత్ ఇచ్చిందన్న ప్రచారం జరిగింది. కానీ భారత్ ఆ నౌకను కాపాడేందుకు ప్రయత్నించింది.  ఈ నౌక మునిగిపోవడానికి ముందే భారత్ దీనికి ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమైంది. 

అమెరికా దాడికి ముందు భారత్ ఆశ్రయం

ఇరాన్ , అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ప్రమాదాన్ని పసిగట్టిన భారత్  IRIS దేనా కు తన ఓడరేవుల్లో రక్షణ కల్పించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి చివరలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడే, తమ నావికాదళ అతిథిగా వచ్చిన ఈ నౌక సురక్షితంగా ఉండేందుకు భారత్  సేఫ్ హార్బర్  ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఈ లోపే మార్చి 4వ తేదీన శ్రీలంకలోని గాలే   తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో అమెరికా సబ్‌మెరైన్ ప్రయోగించిన టార్పెడో దాడిలో ఈ నౌక మునిగిపోయింది.

మరో నౌకకు కొచ్చిలో చోటు 

IRIS దేనా పై దాడి జరిగిన రోజే, ఇరాన్‌కు చెందిన మరో యుద్ధనౌక IRIS లావన్  కు భారత్ తన కొచ్చి ఓడరేవులో ఆశ్రయం కల్పించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నౌక అత్యవసరంగా డాకింగ్ కావాలని కోరడంతో, మానవతా దృక్పథంతో భారత్ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ నౌకలోని 183 మంది సిబ్బందికి కొచ్చిలోని నావికాదళ కేంద్రాల్లో భారత్ ఆశ్రయం కల్పిస్తోంది. దీనితో పాటు IRIS బుషెహర్  అనే మరో నౌకకు శ్రీలంక కూడా ఆశ్రయం ఇచ్చింది. 

 దౌత్యపరమైన చిక్కులు 

భారత్ నిర్వహించిన విన్యాసాలకు అతిథిగా వచ్చిన నౌకపై అమెరికా దాడి చేయడం దౌత్యపరంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అధికారికంగా మౌనం వహించినప్పటికీ, విపక్షాలు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. భారత నావికాదళం ఆహ్వానించిన గెస్ట్  షిప్‌ను కాపాడుకోలేకపోవడం మన వ్యూహాత్మక వైఫల్యమని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ దాడికి భారత్‌కు చట్టపరమైన బాధ్యత లేదని విశ్లేషకులు చెబుతున్నారు.   

 యుద్ధం విస్తృతికి సంకేతం 

పశ్చిమాసియాకు పరిమితమైన ఇరాన్-అమెరికా సంఘర్షణ ఇప్పుడు హిందూ మహాసముద్రానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. భారత భూభాగానికి ఇంత దగ్గరలో ఒక యుద్ధనౌకను అమెరికా ముంచేయడం ద్వారా, ఇరాన్‌కు ఎక్కడా రక్షణ లేదనే సంకేతాన్ని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పంపినట్లు భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత హిందూ మహాసముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై మరియు భారత్ తన తటస్థ వైఖరిని ఎలా కాపాడుకుంటుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.           

టాప్ హెడ్ లైన్స్

రాచర్ల అడవుల్లో ఘోరం.. ఉచ్చులో పడి పెద్దపులి మృతిపై విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
రాచర్ల అడవుల్లో ఘోరం.. ఉచ్చులో పడి పెద్దపులి మృతిపై విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget