అన్వేషించండి

American Telugu couple: తెలుగుజంట అమెరికాలో డాన్స్ రీల్ చేశారు- తల ఎత్తుకోలేకపోతున్నారు !

US Telugu Couple : రెండో ప్రపంచయుద్ధ మెమోరియల్ వద్ద తెలుగు జంట చేసిన డాన్స్ రీల్ వారిపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతోంది.దీంతో వారు అన్ని సోషల్ మీడియా ఖాతాలను నిలిపేసుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లారు.

World War II Memorial Dance : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం (World War II Memorial) వద్ద ఒక భారతీయ ఇంజనీర్ జంట  చేసిన  డాన్స్  రీల్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను వివాదానికి దారితీసింది. మధు రాజు అనే వ్యక్తి, అమెరికాలో క్లౌడ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా పని చేస్తూ, యుద్ధ వీరుల త్యాగాలకు చిహ్నమైన ఆ పవిత్ర స్థలంలో డాన్స్ చేస్తూ వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో  వైరల్ అయింది. దాదాపు 10 లక్షలకు పైగా వ్యూస్ పొందింది.  వీరు చేసిన పని తీవ్ర విమర్శల పాలయింది. యుద్ధ వీరులను  అవమానించారని మండిపడుతున్నారు. 
 
మధు రాజు అమెరికాలో హెచ్-1బి (H-1B) వీసాపై ఉంటూ ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నారు. దీనికి తోడు డల్లాస్‌లో  MAD Dance అనే పేరుతో ఒక డాన్స్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను గౌరవించాల్సిన చోట ఇలాంటి ప్రవర్తన సరికాదంటూ అమెరికన్ నెటిజన్లు, ముఖ్యంగా వెటరన్ల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. వివాదం ముదరడంతో మధు రాజు తన సోషల్ మీడియా ఖాతాలతో పాటు తన డాన్స్ స్టూడియో వెబ్‌సైట్‌ను కూడా తొలగించారు.

 అప్పటికే నెటిజన్లు ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, గత చరిత్రను సేకరించి ఒక సమగ్ర నివేదిక  తయారు చేశారు. ఈ వ్యవహారాన్ని అమెరికా విదేశాంగ శా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో  ఆయన వీసాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నాటికి ఈ అంశంపై అధికారికంగా ఫిర్యాదు అందే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు, సదరు కంపెనీ యాజమాన్యానికి కూడా నెటిజన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా కోసం ప్రాణత్యాగం చేసిన వారిని అవమానించే వ్యక్తిని ఉద్యోగంలో కొనసాగించడం కంపెనీ ప్రతిష్టకు భంగకరమని, తక్షణమే అతడిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. టెక్ రంగంలో వేలాది మంది స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా ఉన్న తరుణంలో, ఇలాంటి ప్రవర్తన కలిగిన విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఈ ఘటన ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో కూడా చర్చనీయాంశమైంది. ఒక వ్యక్తి చేసిన బాధ్యతారాహిత్యమైన పని వల్ల మొత్తం ప్రవాస భారతీయులపై, ముఖ్యంగా హెచ్-1బి వీసా దారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు కంపెనీ ఈ వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Viral Video: సామాన్యుడిలా దుకాణం వద్ద రూ. 10 కి ఝాల్ ముడీ కొని తిన్న ప్రధాని నరేంద్ర మోదీ
సామాన్యుడిలా దుకాణం వద్ద రూ. 10 కి ఝాల్ ముడీ కొని తిన్న ప్రధాని నరేంద్ర మోదీ
PBKS Highest Score in IPL 2026: పంజాబ్ సిక్సర్ల సునామీ.. 21 సిక్స‌ర్ల‌తో సీజ‌న్లో హ‌య్యెస్ట్ స్కోర్.. ప్రియాంశ్, కాన్లీ ఫిఫ్టీలు, తేలిపోయిన ల‌క్నో బౌలింగ్
పంజాబ్ సిక్సర్ల సునామీ.. 21 సిక్స‌ర్ల‌తో సీజ‌న్లో హ‌య్యెస్ట్ స్కోర్.. ప్రియాంశ్, కాన్లీ ఫిఫ్టీలు, తేలిపోయిన ల‌క్నో బౌలింగ్
US Iran Ceasefire: అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
Ola Sona Weekend: అక్షయ తృతీయ ధమాకా.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 50,000 వరకు బెనిఫిట్స్! 
అక్షయ తృతీయ ధమాకా.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 50,000 వరకు బెనిఫిట్స్! 
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PBKS Highest Score in IPL 2026: పంజాబ్ సిక్సర్ల సునామీ.. 21 సిక్స‌ర్ల‌తో సీజ‌న్లో హ‌య్యెస్ట్ స్కోర్.. ప్రియాంశ్, కాన్లీ ఫిఫ్టీలు, తేలిపోయిన ల‌క్నో బౌలింగ్
పంజాబ్ సిక్సర్ల సునామీ.. 21 సిక్స‌ర్ల‌తో సీజ‌న్లో హ‌య్యెస్ట్ స్కోర్.. ప్రియాంశ్, కాన్లీ ఫిఫ్టీలు, తేలిపోయిన ల‌క్నో బౌలింగ్
US Iran Ceasefire: అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Editor Madhu Reddy: తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
 Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే ఏప్రిల్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్! పూర్తి వివరాలు ఇవే!
కియా కార్లపై అదిరిపోయే ఏప్రిల్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్! పూర్తి వివరాలు ఇవే!
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Embed widget