Fuel bomb hits Pakistan: ప్రజలపై పెట్రోల్ బాంబేసిన పాకిస్తాన్ ప్రభుత్వం - లీటర్‌కు ఏకంగా రూ.55 పెంపు
Pakistan: పాకిస్థాన్ చరిత్రలోనే పెట్రోల్‌పై లీటర్‌పై ఏకంగా 55 పాకిస్తాన్ రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్కడ పెట్రోల్ ధర లీటరుకు 321 రూపాయలకి చేరింది.

Fuel bomb hits Pakistan: గల్ఫ్ దేశాలపై పడుతున్న ఇరాన్ క్షిపణుల కారణంగా పాకిస్థాన్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఆ దేశ ప్రభుత్వం తన దేశ ప్రజలపై భారీ పెట్రోల్ బాంబు వేయాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో, లీటరు పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా 55 పాకిస్తాన్ రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు శనివారం నుండి అమలులోకి వచ్చాయి.
పాకిస్థాన్ చరిత్రలోనే ఇది అత్యధిక పెరుగుదలగా నమోదైంది. తాజా పెంపుతో అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 321 రూపాయలకి , హైస్పీడ్ డీజిల్ ధర 336 రూపాయలకు చేరుకుంది. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ దెబ్బతిన్నదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని పాక్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ వెల్లడించారు.
Pakistan 🚨
— Farhad khan (@its__farhad) March 6, 2026
The government has dropped another petrol bomb on the public, increasing the prices of petrol and diesel by 55 rupees per liter. Petrol now costs 321.17 rupees, while diesel has surged to 335.86 rupees per liter, pushing fuel completely out of reach for the common… pic.twitter.com/HrSAgDW8Tp
ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. పాకిస్థాన్ తన చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో, దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పరిస్థితిని గమనిస్తూ ఇకపై ప్రతి వారం పెట్రోల్ ధరలను సమీక్షించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.
Is it acceptable for you to be humiliated by rising prices.
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) March 7, 2026
But not acceptable to stand up against oppression?
Instead of standing in long lines at petrol pumps.
Stand in front of the houses of those rulers of the oppressive military regime who are crushing the people,… pic.twitter.com/KVDHeOwR7N
ఈ ఆకస్మిక ధరల పెరుగుదల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాక్ ప్రజలకు ఈ తాజా ఫ్యూయల్ బాంబు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. మరోవైపు, దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు.
ట్రెండింగ్ వార్తలు



















