అన్వేషించండి

Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!

Secunderabad Railway Stations: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 714. 73 కోట్లు కేటాయించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూ. 714.73 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మాణం.
  • 90% పనులు పూర్తయ్యాయి, ఏప్రిల్ 2026 నాటికి ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి.
  • QR కోడ్ ఎంట్రీ, ఎయిర్‌పోర్ట్ తరహా స్కానర్లతో భద్రత పెంపుదల.
  • విశాలమైన కాన్ కోర్స్, మెట్రో అనుసంధానం, షాపింగ్, రెస్టారెంట్ సౌకర్యాలు.

Secunderabad Railway Stations: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో అత్యంత రద్దీగా ఉండే చారిత్రక సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఇప్పుడు సరికొత్త హంగులతో అంతర్జాతీయ స్థాయి రూపాన్ని సంతరించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్‌ భారత్ స్టేషన్‌ స్కీమ్‌ కింద ఈ స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టులో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే నెల, అంటే ఏప్రిల్ 2026 నాటికి, ప్రయాణికులు విమానాశ్రయాలను తలపించే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ వరల్డ్ క్లాస్ స్టేషన్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 

714.73 కోట్ల బడ్జెట్‌తో అద్భుత దృశ్యం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 714. 73 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్ మొత్తం బిల్టప్ ఏరియాను 1.5 లక్షల చదరపు అడుగులకు విస్తరించారు. కేవలం  రైళ్లు వచ్చి వెళ్లే ప్రదేశంగానే కాకుండా, ఇదొక మల్టీ మోడ్‌ హబ్‌గా రూపు దిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు కింద విశాలమైన ఎయిర్‌ కాన్ కోర్స్‌, ఆధునిక ప్లాట్‌ ఫామ్‌లు, అంతర్జాతీయ ప్రమాణాలో కూడిన ప్రయాణికుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 

151 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రోజుకు లక్షలాది మంది ప్రయాణికులకు ఒక గేట్‌ వేగా నిలుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో మొత్తం 121 స్టేషన్లు అమృత్‌ భారత్ పథకం అభివృద్ధి చేస్తుండగా , సికింద్రాబాద్ స్టేషన్ ఈ జాబితాలో అత్యంత కీలకమైనదిగా మారింది. జనవరి 2026 నాటికి 50 శాతం పనులు మాత్రమే పూర్తి అయినట్టు గతంలో సమాచారం ఉన్నప్పటికీ అధికారులు మిషన్ మోడ్‌లో పని చేస్తూ కేవలం రెండు నెలల్లోనే ఆ సంఖ్యను 90 శాతానికి చేర్చారు. 

ప్రస్తుతం స్టేషన్‌లో ఎయిర్‌ కాన్ కోర్స్‌ నిర్మాణం, ప్లాట్‌ ఫామ్‌ పొడిగింపులు, ఇంటిగ్రేటెడ్‌ పార్కింగ్‌ సౌకర్యాల వంటి చివరి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2026 చివరి నాటికి పూర్తిగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

క్యూఆర్‌ కోడ్‌ ఎంట్రీ- భద్రతలో సరికొత్త విప్లవం

ఈ పునర్నిర్మాణంలో అత్యంత వినూత్నమైన మార్పు ఏంటంటే.. ప్రయాణికుల ప్రవేశ విధానంలో మార్చేశారు. మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌ల తరహాలో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఆధారిత ఎంట్రీ సిస్టమ్‌ను ప్రవేశ పెడుతున్నారు. అంటే ప్రయాణికులు తమ రైలు టికెట్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే తప్ప స్టేషన్‌లోకి ప్రవేశించ అవకాశం ఉండదు. 

ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశం భద్రతను పటిష్టం చేయడం, టికెట్‌ లేని ప్రయాణికులను అరికట్టడం. ఇప్పటికే యూటీఎస్ యాప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్ల కోసం ఈ క్యూఆర్‌ కోడ్ స్కానర్లను సౌత్ సెంట్రల్‌ రైల్వే అమలు చేస్తోంది. భవిష్యత్‌లో ఈ విధానం స్టేషన్‌లోని అన్ని ఎంట్రీ పాయింట్లకు విస్తరించనున్నారు. 

భద్రత విషయంలో రైల్వే శాఖ ఎక్కడా రాజీ పడటం లేదు. ఎయిర్‌ పోర్ట్ స్టైల్‌లో ప్రతి ఎంట్రీ గేట్ వద్ద కనీసం రెండు ఎక్స్‌రే బ్యాగేజ్‌ స్కానర్లు, డోర్‌ ఫ్రేమ్‌ మెటల్ డిటెక్టర్లు,ఆధునిక సామాను తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్పులు మహిళలు, పిల్లలు, వృద్ధులకు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయని అధికారులు ఆశాబావం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రయాణికులకు లభించే సౌకర్యాలు

కొత్తా రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల పైన విశాలమైన కూర్చొనే ప్రదేశం ఉంటుంది. మొత్తం 12 ప్లాట్‌ఫామ్‌లను ఆధునీకరించి, వాటిని విస్తరించారు. స్టేషన్‌ను నేరుగా మెట్రో రైల్‌తో అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులు ఒక రవాణా వ్యవస్థ నుంచి మరొక దానికి సులభంగా మారవచ్చు. వాహనాల రద్దీని తగ్గించేందుకు భారీగా పార్కింగ్‌ సముదాయాన్ని నిర్మించారు. ప్రయాణికులు కాలక్షేపం చేయడానికి షాపింగ్‌ ఏరియాలు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ హితమైన ఫీచర్లు, వైఫై, ఎస్కలేటర్లు, లిఫ్టుల వంటి ఆధునిక వసతులు ఈ స్టేషన్‌ ప్రత్యేకత. 

దేశవ్యాప్త లక్ష్యంలో భాగం... 

అమృత్ భారత్‌ స్కీమ్‌ కింద దేశవ్యాప్తంగా మొత్తం 1275 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో జరుగుతున్న పనులు రాష్ట్ర రవాణా వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఈ మార్పు వల్ల సికింద్రాబాద్‌ స్టేషన్ దక్షిణ భారత దేశంలోనే ఒక బలమైన రైల్వే హబ్‌గా మారుతుంది.        

Frequently Asked Questions

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయి?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ఏప్రిల్ 2026 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 90% పనులు పూర్తయ్యాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు ఎంత బడ్జెట్ కేటాయించారు?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 714.73 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్ విస్తీర్ణాన్ని 1.5 లక్షల చదరపు అడుగులకు పెంచారు.

స్టేషన్‌లోకి ప్రవేశించడానికి కొత్తగా ఎలాంటి విధానం ప్రవేశపెట్టారు?

మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌ల తరహాలో క్యూఆర్ కోడ్ ఆధారిత ఎంట్రీ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నారు. ప్రయాణికులు తమ టికెట్&zwnjపై ఉన్న క్యూఆర్‌ కోడ్&zwnjను స్కాన్&zwnj చేస్తేనే స్టేషన్&zwnjలోకి ప్రవేశం ఉంటుంది.

కొత్త సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి?

విశాలమైన కూర్చునే ప్రదేశాలు, ఆధునీకరించిన 12 ప్లాట్‌ఫామ్&zwnjలు, మెట్రో అనుసంధానం, భారీ పార్కింగ్, షాపింగ్&zwnj ఏరియాలు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, వైఫై, ఎస్కలేటర్లు, లిఫ్టులు వంటి ఆధునిక వసతులు ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget