అన్వేషించండి

Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

ఫిర్యాదుదారుపై లైంగికదాడికి పాల్పడి, వీడియోలతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడనే తీవ్ర ఆరోపణలతో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ యు.శ్రీనివాసులురెడ్డిని హైదరాబాద్ సీపీ వి.సి.సజ్జనర్ సస్పెండ్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫిర్యాదుదారురాలిని లోబరుచుకొని, వీడియోలతో వేధించిన పోలీసు అధికారి.
  • ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి డబ్బులు గుంజాడు.
  • బాధితురాలు లైంగిక దాడి, అబార్షన్ ఆరోపణలు కూడా చేసింది.
  • ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపి సజ్జనార్ సస్పెండ్ చేశారు.

హైదరాబాద్‌: న్యాయం చేస్తారని నమ్మి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళని లొంగదీసుకున్నాడు ఓ సీఐ. ఆపై ఆమెతో లైంగిక అవసరాలు తీర్చుకుని, వీడియోలు తీసి వేధిస్తున్నట్లుగా తేలడంతో పోలీస్ శాఖ ఆ సీఐపై వేటు వేసింది. మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజుతున్నట్లు గుర్తించిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనర్ సస్పెన్షన్ వేటు వేశారు. విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడంతో పాటు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన కేవలం 4 నెలల్లోనే ఆయన సస్పెండ్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో రిలేషన్, లైంగిక దాడి

తనకున్న సమస్యపై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలికి  ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో తన మొబైల్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, ఆపై అబార్షన్ కూడా చేయించాడని బాధితురాలు తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి నుంచి వచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సీఐ శ్రీనివాసులు రెడ్డిపై శాఖా పరంగా అంతర్గత విచారణకు ఆదేశించారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను శ్రీనివాసులురెడ్డి ఖండించారు. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళే తనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసిందని ఆయన ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం కమిషనర్ సజ్జనార్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. 

Also Read: Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Frequently Asked Questions

ఏ సీఐ సస్పెండ్ అయ్యారు, ఎందుకు?

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో లైంగిక సంబంధం పెట్టుకుని, వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసినందుకు.

సీఐ శ్రీనివాసులు రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏమిటి?

ఆయన ఓ మహిళతో లైంగిక దాడికి పాల్పడి, ఆమె వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, అబార్షన్ కూడా చేయించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

సీఐ శ్రీనివాసులు రెడ్డిని ఎవరు సస్పెండ్ చేశారు?

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనర్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. విధి నిర్వహణలో అలసత్వం, తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

సస్పెండ్ అయ్యే ముందు సీఐ ఎంతకాలం బాధ్యతల్లో ఉన్నారు?

బాధ్యతలు చేపట్టిన కేవలం 4 నెలల్లోనే సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget