అన్వేషించండి

Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Trainee IPS Uday Krishna Reddy: తోటి ట్రైనీ ఐపీఎస్‌ను వేధించిన కేసులో పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని మిర్యాలగూడ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

IPS Officer Controversies:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారితో అనుచితంగా ప్రవర్తించిన  కేసులో పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణకు సహకరించకుండా, సెక్షన్ 35(3) BNSS  కింద జారీ చేసిన చట్టబద్ధమైన నోటీసులను కూడా తీసుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనను నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ప్రత్యేక పోలీస్ బృందాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి.  

తోటి మహిళా ఐపీఎస్‌ను వేధించినట్లుగా కేసు నమోదు             

రాజేంద్రనగర్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ   లో శిక్షణ పొందుతున్న కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఉదయ్ కృష్ణారెడ్డి తనను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితుడు జూన్ 23 నుంచి తనకు అసభ్యకర మెసేజ్‌లు పంపాడని పేర్కొన్నారు. ఆపై జూలై 8న గదిలోకి లాకెళ్లి ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని బెదిరించాడని.. జూలై 9న గదిలో బంధించి, జుట్టు పట్టుకుని దాడి చేసి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడని ఆరోపించారు. జూలై 10న తన ప్రైవేట్ వీడియోలు తీసి, వాటిని తన భర్తకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.        

అత్తాపూర్ స్టేషన్‌లో కేసు నమోదు - సస్పెండ్ చేసి అకాడెమీ నుంచి పంపేసిన అధికారులు           

బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 74, 75, 77, 315(2)తో పాటు ఐటీ చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేశారు. నిందితుడు గతంలోనూ సహచర ఐపీఎస్‌లతో అమర్యాదగా ప్రవర్తించేవాడని, వాట్సప్ గ్రూపుల ద్వారా కొందరిని వేధించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డిని నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేసి అకాడమీ నుండి పంపించివేశారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ప్రివిలేజ్ కమిటీ.. సీసీటీవీ దృశ్యాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించి విచారించిన అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించి ఈ తక్షణ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది.         

ఆత్మహత్యాయత్నం, సూసైడ్ నోట్ పేరుతో డ్రామాతో మరిన్ని చిక్కులు                  

తర్వాత ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా డ్రామా ఆడారు. అధికంగా మద్యం సేవించి స్పృహతప్పిపడిపోయారు. సూసైడ్ నోట్ రాసినట్లుగా ఓ రెండు పేజీలు రాసి.. ఆమెతో వివాహేతర బంధం ఉందన్నట్లుగా ప్రచారం చేశారు. ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత కనిపించకుండా పోయారు. రెండు రోజుల పాటు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. అయితే ఆయన ఏపీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లుగా సమాచారం రావడంతో మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget