తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేయడంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం పేరుతో నాటకమాడారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

- మహిళా ఐపీఎస్ ఫిర్యాదుతో తోటి ట్రైనీ ఐపీఎస్ అపస్మారక స్థితికి.
- ఆత్మహత్యాయత్నం నాటకమని, కేవలం అతిగా మద్యం సేవించినట్లు నిర్ధారణ.
- నిందితుడు ఆరోపణలు నిరాధారమన్నాడు, తమ రిలేషన్‌కు సాక్ష్యాలున్నాయన్నాడు.
- అకాడమీ అంతర్గత కమిటీ విచారణ, పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు సేకరించారు.
IPS Uday Krishna Reddy | హైదరాబాద్: నేషనల్ పోలీస్ అకాడమీలో సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు, తోటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని డాక్టర్లు గుర్తించారు. కేవలం కేసు నుండి తప్పించుకోవడానికి, సానుభూతి పొందడం కోసమే ఆత్మహత్యాయత్నం అని నాటకం ఆడినట్లు సైతం పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైంది. తనపై కేసు నమోదు కావడంతో అతిగా మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు అతడి ఫ్రెండ్స్ భావించారని పోలీసులు తెలిపారు.
అతిగా మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి...
రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదవడంతో కెరీర్ ఏమైతుందోనని ఆందోళనకు గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం అమీర్‌పేట్‌లోని తన ఫ్రెండ్ రూముకు వెళ్లాడు. రాత్రి అతిగా మద్యం సేవించాడు. ఆహారం తీసుకోకుండా అతిగా తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సోమవారం ఉదయం ఎంత లేపినా లేవకపోవడం, మంచం పక్కన శానిటైజర్, మద్యం సీసాలను చూసి ఆత్మహత్యాయత్నం చేశాడని భావించి ఎస్సార్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అయితే అతడు ఏం తాగాడో తెలుసుకునేందకు బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా, శరీరంలో ఎలాంటి విషపదార్థాలు లేవని తేలిపోయింది. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడంటూ ఫ్రెండ్స్, అతడి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిలు కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ తన సమస్యను నోట్ రాసి పెట్టారు. అది సూసైడ్ నోట్ అని నాటకమాడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇంటర్నల్ కమిటీ విచారణ.. పోలీసుల దర్యాప్తు వేగవంతం
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు జాతీయ పోలీస్ అకాడమీ అధికారులు అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిన అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు అకాడమీ అధికారులతో సమావేశమై సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు.

ఆ ఆరోపణలు నిరాధారం: ఉదయ్ కృష్ణారెడ్డి
తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో జూన్ 2025 నుంచి రిలేషన్‌లో ఉన్నానని, ఎన్నోసార్లు ఆమె నా గదికి వచ్చి డోర్ ఓపెన్ చేయాలంటూ వాట్సాప్ మెస్సేజ్ చేసిందని నోట్ లో పేర్కొన్నారు. తాము కలిసి ఉన్న వీడియోలను ఆమె భర్తకు పంపినందుకే తనపై కక్షగట్టి ఫిర్యాదు చేసిందని చెబుతున్నారు. తమ చాటింగ్, ఇతర ఆధారాలన్నీ తన ఫోన్‌లో ఉన్నాయని, పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పిస్తానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆమె ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేసినట్లు ఆరోపించారు. న్యాయం గెలుస్తుందని ఉదయ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయితే సూసైడ్ నోట్ అని వైరల్ అయిన పోస్టు చూస్తే ఆయన తప్పు చేయలేదని.. వారిద్దరూ పరస్పరం కలిసి టైమ్ గడిపారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తనకు న్యాయం జరుగుతుందని, కోర్టుపై, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి అన్నారు.
Frequently Asked Questions
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు ఎందుకు నమోదైంది?
ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వార్తల్లో నిజమెంత?
డాక్టర్ల పరీక్షల్లో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తేలలేదు. కేసు నుండి తప్పించుకోవడానికి, సానుభూతి పొందడానికి నాటకం ఆడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. అతిగా మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
తనపై వచ్చిన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి వాదన ఏమిటి?
తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. తాము రిలేషన్‌లో ఉన్నామని, ఆమె భర్తకు వీడియోలు పంపినందుకే తనపై ఫిర్యాదు చేసిందని ఆరోపించారు.
ఈ ఘటనపై ఎలాంటి విచారణ జరుగుతోంది?
జాతీయ పోలీస్ అకాడమీ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. అత్తాపూర్ పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేసి సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























