అన్వేషించండి

కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌

2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌ అయింది. కొత్త డిజైన్‌, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 360 డిగ్రీ కెమెరా, 204 హెచ్‌పీ డీజిల్‌ ఇంజిన్‌, 4x4 సామర్థ్యంతో లైఫ్‌స్టైల్‌ పికప్‌ సెగ్మెంట్‌లో కొత్త ఎంపికగా నిలిచింది.

2026 Toyota Hilux Price And Features Telugu: 2026 టయోటా హైలక్స్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది టయోటా. తొమ్మిదో తరం హైలక్స్‌ ప్రారంభ ధర రూ.31.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా కొత్త డిజైన్‌, మరింత ఆధునిక క్యాబిన్‌, అదనపు టెక్నాలజీ ఫీచర్లతో ఈ పికప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే హైలక్స్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన IMV బాడీ ఆన్‌ ఫ్రేమ్‌ ఫ్లాట్‌ఫామ్‌ను అలాగే కొనసాగించింది. ప్రస్తుతం బుకింగ్‌లు ప్రారంభం కాగా, ఆగస్టు రెండో వారంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

వేరియంట్లు - ధరలు
భారత్‌లో కొత్త హైలక్స్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. GX 4x2 AT ధర రూ.31.99 లక్షలు కాగా, GX 4x4 AT ధర రూ.33.69 లక్షలు. టాప్‌ ఎండ్‌ VX 4x4 AT ధర రూ.36.69 లక్షలు. ఈ లైఫ్‌స్టైల్‌ పికప్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఇసుజు వి క్రాస్‌ ( Isuzu V-Cross) నిలవనుంది. పాత హైలక్స్‌తో పోలిస్తే ఎంట్రీ ధర రూ.3.47 లక్షలు పెరిగినా, టాప్‌ వేరియంట్‌ ధర కేవలం రూ.69 వేల మాత్రమే పెరగడం గమనార్హం.

ఎక్స్‌టీరియర్‌
కొత్త హైలక్స్‌ ముందు భాగం పూర్తిగా మారిపోయింది. సాంప్రదాయ టయోటా లోగో స్థానంలో పెద్ద అక్షరాలతో TOYOTA లెటరింగ్‌ను అమర్చారు. స్లిమ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, LED DRLs, హనీకాంబ్‌ గ్రిల్‌, వెడల్పైన ఎయిర్‌ ఇంటేక్స్‌, సిల్వర్‌ స్కిడ్‌ ప్లేట్‌, LED ఫాగ్‌ ల్యాంప్స్‌తో ముందు భాగం మరింత దృఢంగా కనిపిస్తుంది. పక్క భాగంలో బ్లాక్‌ వీల్‌ ఆర్చ్‌ క్లాడింగ్‌, 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, రోల్‌ బార్స్‌, ఫుట్‌బోర్డ్‌, ఎలక్ట్రిక్‌గా అడ్జస్ట్‌ అయ్యే & మడతపడే ORVMలు, షార్క్‌ ఫిన్‌ యాంటెన్నా ఉన్నాయి.

వెనుక భాగంలో C ఆకార LED టెయిల్‌ ల్యాంప్స్‌, టెయిల్‌గేట్‌పై TOYOTA లెటరింగ్‌, సరుకులు ఎక్కించేందుకు సులభంగా ఉండే ఇంటిగ్రేటెడ్‌ స్టెప్‌తో కొత్త బంపర్‌ను అందించారు. 

ఇది కూడా చదవండి: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్

రంగులు
ఈ పికప్‌ను సల్ఫర్‌ మెటాలిక్‌, ప్లాటినం పెర్ల్‌ వైట్‌ మెటాలిక్‌, ఆటిట్యూడ్‌ బ్లాక్‌, యాష్‌, ఎమోషనల్‌ రెడ్‌, సూపర్‌ వైట్‌ కలిపి మొత్తం ఆరు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఇంటీరియర్‌
క్యాబిన్‌లో పూర్తిగా కొత్త డ్యాష్‌బోర్డ్‌ను అందించారు. ఇందులో 7 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, కొత్త మూడు స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ ఉన్నాయి. వైర్‌లెస్‌ Apple CarPlay & Android Auto, వైర్‌లెస్‌ ఛార్జర్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, వెనుక సీటు ఆర్మ్‌రెస్ట్‌, కప్‌ హోల్డర్స్‌, PM2.5 ఎయిర్‌ ఫిల్టర్‌, 8 స్పీకర్‌ ఆడియో సిస్టమ్‌, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే Eco, Normal & Sport అనే మూడు డ్రైవ్‌ మోడ్‌లను కూడా అందించారు.

భద్రత
సేఫ్టీ విషయంలో కూడా టయోటా రాజీ పడలేదు. ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌, VSC, ABS, బ్రేక్‌ అసిస్ట్‌, ముందు & వెనుక పార్కింగ్‌ సెన్సర్లు, TPMS, Isofix చైల్డ్‌ సీట్‌ మౌంట్స్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో లభించే ADAS, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, 12.3 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, డ్యూయల్‌ జోన్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు భారత మోడల్‌లో అందుబాటులో లేవు.

ఇది కూడా చదవండి: Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్

పవర్‌ & టార్క్‌
కొత్త హైలక్స్‌లో, ఇప్పటికే పరిచయమైన 2.8 లీటర్‌ నాలుగు సిలిండర్ల డీజిల్‌ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 204 హెచ్‌పీ శక్తి & 500 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తున్నారు. ఈసారి మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే తొలిసారిగా 4x2 ఆటోమేటిక్‌ వేరియంట్‌ను కూడా పరిచయం చేశారు. 4x4 వేరియంట్లలో లో రేంజ్‌ ట్రాన్స్‌ఫర్‌ కేస్‌, ఎలక్ట్రానిక్‌ డిఫరెన్షియల్‌ లాక్‌, మల్టిపుల్‌ టెర్రెయిన్‌ మోడ్‌లు, డౌన్‌హిల్‌ అసిస్ట్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఆటో లిమిటెడ్‌ స్లిప్‌ డిఫరెన్షియల్‌ వంటి ఆఫ్‌రోడ్‌ ఫీచర్లు ఉండటంతో కఠినమైన రోడ్లపైనా ఈ పికప్‌ సమర్థంగా దూసుకెళ్లగలదు. మొత్తంగా చూస్తే.. కొత్త డిజైన్‌, మెరుగైన ఫీచర్లు & శక్తిమంతమైన డీజిల్‌ ఇంజిన్‌తో 2026 టయోటా హైలక్స్‌ భారత మార్కెట్‌లోకి వచ్చింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget