జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
Kawasaki Z900 కొనుగోలు చేసే వారికి జులై 31 వరకు ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. ఉచిత తొలి సర్వీస్‌తో పాటు టాల్ వైజర్ కూడా ఫ్రీగా లభిస్తోంది. ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

Kawasaki Z900 July 2026 Offer: ప్రీమియం స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆలోచిస్తున్న యువతకు కవాసాకి అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న Kawasaki Z900పై పరిమిత కాలం ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ముఖ్యంగా, జులై 31లోపు బైక్‌ను కొనుగోలు చేసే వారికి ఉచిత తొలి సర్వీస్‌తో పాటు టాల్ వైజర్‌ను కూడా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను ముంబైలోని ప్రముఖ Kawasaki డీలర్ ప్రకటించడం విశేషం.
లార్జ్ మీటర్ కవర్
ఈ ఆఫర్‌లో భాగంగా కంపెనీ అందిస్తున్న టాల్ వైజర్ సాధారణంగా బైక్‌తో వచ్చే స్టాండర్డ్ వైజర్ కంటే పెద్దదిగా ఉంటుంది. దీనిని Kawasaki 'లార్జ్ మీటర్ కవర్'గా పిలుస్తోంది. ఇది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు మరింత మెరుగైన రక్షణను అందించడంతో పాటు, హైవే ప్రయాణాల్లో గాలి నేరుగా తగలకుండా కొంతవరకు సహాయపడుతుంది. బైక్ లుక్‌ను కూడా మరింత అగ్రెసివ్‌గా మార్చే యాక్సెసరీగా దీనిని భావిస్తున్నారు.
తొలి సర్వీస్ ఉచితం
ఇదే కాకుండా, కొత్తగా Z900 కొనుగోలు చేసే వారికి తొలి సర్వీస్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. సాధారణంగా ప్రీమియం బైక్‌ల సర్వీస్ ఖర్చు ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఈ ఆఫర్ కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించనుంది. అయితే ఈ రెండు ప్రయోజనాలు జులై 31లోపు బుకింగ్ పూర్తి చేసిన వారికి మాత్రమే వర్తిస్తాయి.
ఇది కూడా చదవండి: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్ ఫ్రెండ్లీ వేరియంట్ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
ఆఫర్లు ప్రకటించినప్పటికీ బైక్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. Kawasaki Z900 ఎక్స్‌షోరూమ్ ధర రూ.9.99 లక్షలుగానే కొనసాగుతోంది. అంటే అదనపు ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ కొనుగోలుదారులు బైక్ కోసం గతంలో ఉన్న అదే ధరను చెల్లించాల్సి ఉంటుంది.
పనితీరు విషయానికి వస్తే, Kawasaki Z900లో 948cc, ఇన్‌లైన్ 4, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 125 hp శక్తి & 98.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, స్మూత్ పవర్ డెలివరీ & హైవే రైడింగ్ సామర్థ్యం కారణంగా ఈ బైక్ ప్రీమియం స్ట్రీట్ నేకెడ్ విభాగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ఇంధన సామర్థ్యం
మైలేజ్ పరంగా కూడా Kawasaki Z900 ఒక లీటర్ పెట్రోల్‌కు సుమారు 21 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. పనితీరు & రోజువారీ వినియోగం మధ్య మంచి సమతుల్యతను కోరుకునే రైడర్లకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
ప్రీమియం స్ట్రీట్ నేకెడ్ బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ ఆఫర్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అదనపు యాక్సెసరీతో పాటు ఉచిత తొలి సర్వీస్ లభించడం వల్ల కొనుగోలు విలువ మరింత పెరుగుతోంది. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ జులై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఆసక్తి ఉన్న వారు త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















