Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.!
మోకాలి గాయం ఇంకా తగ్గకపోవడంతో శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నుంచి జస్ప్రీత్ బుమ్రా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

Jasprit Bumrah Ruled Out Of Lanka Series: శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కి ముందు టీమ్ ఇండియాకు మైండ్ బ్లాకింగ్ షాక్ తగిలింది. ఇండియా ప్రాధాన్య పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ టూర్ కి దూరం కానున్నాడు. మొదట అనుకున్న దానికంటే బుమ్రా మోకాలి వాపు కాస్త సీరియస్ గా ఉండటంతో, రాబోయే టైట్ షెడ్యూల్ ని మైండ్ లో ఉంచుకుని బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సైన్స్ టీమ్ అతడిని హడావుడిగా మైదానంలోకి దించకూడదని ఫిక్స్ అయింది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన థర్డ్ వన్డేలో గాయపడిన 32 ఏళ్ల బుమ్రా సిరీస్ స్టార్ట్ అయ్యేసరికి ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించినా అది సాధ్యపడలేదు.
Cricbuzz understands that Jammu & Kashmir pacer Auqib Nabi is the frontrunner to replace Jasprit Bumrah in the squad for the Sri Lanka Tests.#SLvsIND pic.twitter.com/iJDXZ23bML
— Cricbuzz (@cricbuzz) August 2, 2026
మోకాలి నొప్పితో ఇబ్బంది.. టెస్ట్ ఫార్మాట్ రిస్క్ వద్దన్న మెడికల్ టీమ్
బుమ్రా ఇప్పటికీ మోకాలి నొప్పితో డిస్కమ్‌ఫోర్ట్ ఫీలవుతుండటంతో మెడికల్ టీమ్ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఒకవేళ ఆగస్టు 15 ఫస్ట్ టెస్ట్ కి లేదా ఆగస్టు 23 సెకండ్ టెస్ట్ కి అతడు ఫిట్ అయినా కూడా, ఫ్లాట్ పిచ్‌లపై లాంగ్ స్పెల్స్ వేసే టెస్ట్ ఫార్మాట్ ఆడిస్తే గాయం తీవ్రమయ్యే ఛాన్స్ ఉందని రిస్క్ వద్దని సలహా ఇచ్చింది. బుమ్రాకి ఇంకా రెస్ట్ అవసరమని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.
🚨TEAM INDIA HIT BY INJURY WOES AHEAD OF THE SRI LANKA TEST SERIES❌🇮🇳
— Sports Nexus (@SportsNexusNews) August 2, 2026
Jasprit Bumrah—Ruled Out
Harshit Rana—Ruled Out
Nitish Kumar Reddy—Ruled Out
Washington Sundar—Miss the 1st Test
A massive selection headache for Shubman Gill & Gautam Gambhir before a crucial Test series.💔 pic.twitter.com/eCus7kyDOd
రీప్లేస్‌మెంట్ రేసులో ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్.. సెలెక్టర్ల ఫోకస్
బుమ్రా స్థానంలో రీప్లేస్‌మెంట్ గా జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ లేదా విదర్భ బౌలర్ యశ్ ఠాకూర్ లలో ఒకరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. డొమెస్టిక్ లో విపరీతంగా రాణిస్తున్న ఈ యంగ్ పేసర్లలో ఎవరికి లక్కీ ఛాన్స్ దక్కుతుందో చూడాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది.
లంక టూర్ కి ముందే గాయాల కలకలం.. ఫస్ట్ టెస్ట్ కి కీలక ప్లేయర్లు దూరం
ఇప్పటికే ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (హ్యామ్‌స్ట్రింగ్), పేసర్ హర్షిత్ రాణా (హ్యామ్‌స్ట్రింగ్) లు గాయాలతో సిరీస్ కి దూరం కాగా, వాషింగ్టన్ సుందర్ హ్యామ్‌స్ట్రింగ్ ప్రాబ్లమ్ వల్ల కనీసం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి అయినా అందుబాటులో ఉండడని బిసిసిఐ హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
Before You Go
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు



















