IND vs SL Test Series Updates: శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
శ్రీలంకతో టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కంటే ముందు జరగాల్సిన ఇండియా ప్రాక్టీస్ వార్మప్ మ్యాచ్ ను 4 రోజుల నుంచి 3 రోజులకు కుదించారు.

IND VS SL Shubman Gill Led India Warm Up Cut Short: ఆగస్టులో శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కి ముందు టీమ్ ఇండియా ప్రాక్టీస్ ప్లాన్స్ లో బిగ్ చేంజ్ వచ్చింది. తాజా రిపోర్ట్ ప్రకారం లోకల్ శ్రీలంకన్ ఎలెవన్ టీమ్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ ను ఫోర్-డే గేమ్ నుంచి త్రీ-డే గేమ్ కు షార్ట్ చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సేన ఆగస్టు 7 నుంచి 9 వరకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొననుంది. దీనికి సంబంధించి బిసిసిఐ, టీమ్ మేనేజ్‌మెంట్ కు ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పటికీ స్పష్టమైన రీజన్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ త్రీ-డే వార్మప్ మ్యాచ్ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ కి దగ్గర్లోని ఎన్సీసీ గ్రాండ్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లైవ్ బ్రాడ్‌కాస్ట్ కూడా కానుంది.
“I won’t say I am afraid, but I am concerned” – Deep Dasgupta names Team India’s biggest worry ahead of SL vs IND 2026 Tests
— Cricket Hub (@Anurag9793) August 1, 2026
Deep Dasgupta said:
"If there are bowling-friendly pitches, we have a good bowling attack, we also have Saransh Jain now, who is a good off-spinner, and… pic.twitter.com/iw7edPWUDw
స్పిన్ కండిషన్స్ కి అలవాటు పడేలా ప్లాన్స్.. కొలంబోలో ప్రాక్టీస్ ఫైట్
శ్రీలంకలో స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ కు అలవాటు పడటానికి గిల్ సేనకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ చాలా క్రూషియల్ గా మారనుంది. లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా చేతిలో 0-2 తో హోమ్ సిరీస్ ఓడిపోయిన తర్వాత, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 ఫైనల్ రేసులో ఉండాలంటే శ్రీలంకపై సిరీస్ విక్టరీ ఇండియాకు చాలా ఇంపార్టెంట్ గా మారింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15న స్టార్ట్ కానుండగా, సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 19 నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది.
🚨 REPORTS 🚨
— Sportskeeda (@Sportskeeda) August 1, 2026
India's warm-up fixture against the local Sri Lanka XI has been reduced from four days to three ahead of the Test series. 🇮🇳🏏
The match will begin on August 7 as Team India fine-tunes its preparations for the Sri Lanka tour.
(Source: Cricbuzz)#India #SLvIND… pic.twitter.com/8Erb5nq77Y
దశాబ్ద కాలం తర్వాత లంకలో టెస్ట్ సిరీస్..
దాదాపు డికేడ్ తర్వాత ఇండియా లంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. 2017 లో లాస్ట్ టైమ్ అక్కడ సిరీస్ ఆడగా, 2008 నుంచి శ్రీలంక, ఇండియాపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ లో ఇండియాకు ఇంకా 9 టెస్టులు మిగిలి ఉన్నాయి. శ్రీలంక సిరీస్ తర్వాత 2026 చివర్లో న్యూజిలాండ్ తో టూ-టెస్ట్ మ్యాచ్ లు, 2027 స్టార్టింగ్ లో ఆస్ట్రేలియాతో ఫైవ్-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంటుంది.
శ్రీలంక టెస్ట్ సిరీస్ కి ఇండియన్ కంప్లీట్ స్క్వాడ్ వివరాలు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ జైన్ ఉన్నారు.
Before You Go
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
ట్రెండింగ్ వార్తలు



















