Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
Secunderabad- Tirupati Vande Bharat | తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 26 నుంచి సికింద్రాబాద్, తిరుపతి మధ్య నడిచే రైళ్లలో అదనపు కోచ్ లు ఏర్పాటు చేస్తున్నారు.

Tirupati - Secunderabad Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కున్న డిమాండ్ చాలా ఎక్కువ. సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య మొత్తం 661 కిమీ దూర ప్రయాణన్ని 8గంటల 25 నిమిషాల్లో నే పూర్తి చేస్తుంది ఈ ట్రైన్. అదే మిగిలిన రైళ్లలో అయితే కనీసం సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లడానికి కనీసం 12నుండి 14 గంటల సమయం పడుతుంది. అందుకే భాగ్యనగరం పరిసర ప్రాంతాల నుండి రైల్లో తిరుపతి వెళ్ళాలి అనుకునే భక్తుల ఫస్ట్ ఛాయిస్ వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఈ ట్రైన్ కున్న డిమాండ్ గమనించిన రైల్వే శాఖ ఇప్పుడు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తిరుపతి వందే భారత్ బోగీలు పెంపు.. ఎప్పటి నుండి అంటే
సికింద్రాబాద్ -తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు బో్గీలు పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకూ 14 AC చైర్ కార్ లు, రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లతో ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ కున్న డిమాండ్ దృష్ట్యా మరో 4 AC చైర్ కార్ లు పెంచుతున్నారు.. అంటే ఇకపై 18 AC చైర్ కార్ లు, రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లతో ఈ ట్రైన్ ప్రయాణించబోతోంది. రేపటి నుండే (26.11.2025,గురువారం ) ఈ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులోనికి రాబోతున్నట్టు అధికారులు ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు ఉపయోగం
20701 నెంబర్ తో ఉదయం 6:10కి సికింద్రాబాద్ లో బయలుదేరే తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ నల్గొండ ( 7:24) మిర్యాలగూడ (7:45) గుంటూరు (9:39) ఒంగోలు (11:03),నెల్లూరు (12:19) మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 2:35కి తిరుపతి చేరుకుంటుంది. తిరుగుప్రయాణం లో 20702 నెంబర్ తో అదే రోజు మధ్యాహ్నం 3:15కి తిరుపతి లో బయలుదేరి రాత్రి 11:40 కి సికింద్రాబాద్ చేరుతుంది. వారం లో మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులూ ఈ తిరుపతి వందేభారత్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడూ రద్దీ గా ఉండే ఈ ట్రైన్ లో అదనం గా నాలుగు బో్గీలు రావడం రమంచి పరిణామమే అంటున్నారు ఈ మార్గం లో వెళ్లే ప్రయాణికులు.





















