Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
తిరువనంతపురంలోనూ భారత మహిళల జట్టు దుమ్మురేపింది. సిరీస్ లో చూపించిన దూకుడును మరింత ముందుకు తీసుకువెళ్తూ ఐదో టీ20 లోనూ అదరగొట్టిన అమ్మాయిల టీమ్... సొంతగడ్డపై తొలిసారిగా 5-0తో ఓ టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. టాస్ ఓడిన బ్యాటింగ్ చేసిన భారత్ మొదట్లో భారీగా తడబడింది. 11 ఓవర్లు కంప్లీట్ అయ్యే సరికి భారత్ 77 పరుగులు చేసింది కానీ 5 వికెట్లు కోల్పోయింది. సరిగ్గా ఆ టైమ్ లో తన సీనియార్టినీ చూపించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా తను మాత్రం లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. 43 బాల్స్ లో 9ఫోర్లు ఓ సిక్సర్ తో 63పరుగులు చేసి భారత్ స్కోరు బోర్డును నిలబెట్టింది. చివర్లో అరుంధతిరెడ్డి 11 బాల్స్ లోనే 4 ఫోర్లు ఓ సిక్సర్ తో 27పరుగులు చేయటంతో లాస్ట్ రెండు ఓవర్లలో 32పరుగులు రాబట్టిన భారత్ 7వికెట్ల నష్టానికి 175పరుగులు చేసింది. 176 టార్గెట్ తో బరిలోకి దిగిన లంక కూడా బాగానే ప్రతిఘటించింది. 11 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే నష్టపోయి 86 రన్స్ కొట్టి మెరుగైన స్థితిలో ఉన్నా ఆ తర్వాత భారత్ బౌలర్లు పరుగులు కట్టడి చేయటంతో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ వచ్చాయి. హాసినీ పెరీరా 65 పరుగులు, ఇమేషా 50 పరుగులు చేసినా కూడా టీమిండియా బౌలర్స్ రన్స్ కంట్రోల్ చేయటంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే లంక చేయగలిగింది. ఫలితంగా 5 టీ20 ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసి ట్రోఫీని ముద్దాడింది.





















