Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Artificial intelligence (AI) | మెటా సంస్థలో మళ్లీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ వార్తలు వస్తున్నాయి. ఏకంగా దాదాపు 20% మంది ఉద్యోగులను మెటా సంస్థ తొలగించే అవకాశం ఉంది.

Meta Layoffs: టెక్ ప్రపంచంలో పేరుగాంచిన Meta Platforms కంపెనీ మరోసారి లేఆఫ్స్‌కు వెళ్తోంది. సంస్థలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఊపందుకుంది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ తన మొత్తం ఉద్యోగులలో ఏకంగా 20 శాతం మంది వరకు తొలగించవచ్చు. దీనివల్ల దాదాపు 16,000 మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన టెక్నాలజీ, మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేయడానికి ఈ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే, భవిష్యత్తులో AI సహాయంతో మరింత ప్రభావవంతంగా, వేగంగా పని చేయగల టీమ్స్‌ను మెటా కంపెనీ సిద్ధం చేయాలనుకుంటోంది. అయితే, ప్రస్తుతానికి ఈ తొలగింపుపై త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. తమ ఉద్యోగాలు పోతాయని, ఫ్యూచర్ ఏంటని వేల మంది ఆందోళన చెందుతున్నారు.
వేల ఉద్యోగులకు ముప్పు
కార్పొరేట్ ఫైలింగ్‌ల ప్రకారం, డిసెంబర్ 31, 2025 నాటికి కంపెనీలో దాదాపు 79,000 మంది పని చేస్తున్నారు. అటువంటిది కంపెనీ తన ఉద్యోగులలో దాదాపు 20 శాతం లేఫ్ చేస్తే, దాదాపు 16,000 మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలు చేస్తే, 2022- 23 సమయంలో చేపట్టిన జాబ్ కట్స్ తర్వాత కంపెనీలో ఇది అతిపెద్ద లేఆఫ్స్‌గా చెప్పవచ్చు. ప్రస్తుతానికి, ఈ చర్య సాధ్యమేనని టెక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం బయటకు రాలేదు.
మెటా కంపెనీ గతంలో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. నవంబర్ 2022లో కంపెనీ దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ మొత్తం ఉద్యోగులలో జాబ్ కట్ చేసింది దాదాపు 13 శాతం. ఇప్పుడు అంతకుమించి భారీ ఎత్తున జాబ్ కట్స్ చేసేందుకు సిద్ధమవుతోందని చర్చ జరుగుతోంది. ఉద్యోగాలు పోయి రోడ్డున పడాల్సి వస్తుందని వేల మంది మెటా ఉద్యోగులు తమ భవితవ్యం ఏంటో అర్థంకాక తల పట్టుకుంటున్నారు.
కంపెనీ AI పై ఫోకస్
గత ఏడాది నుంచి మెటా AI రంగంలో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అందు కోసం కంపెనీ తన సూపర్‌ఇంటెలిజెన్స్ బృందంలో పలువురు టాప్ AI రీసెర్చర్స్‌ను చేర్చుకుంది. వీరికి అధిక మొత్తం ప్యాకేజీలు అందించినట్లు సమాచారం. దీనివల్ల కంపెనీ భవిష్యత్తు ఏఐ వైపు ఉంటుందని క్లారిటీ వచ్చింది. కంపెనీ AI పై ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తోంది. అలాగే, మెటా కంపెనీ 2028 నాటికి డేటా సెంటర్ల నిర్మాణానికి దాదాపు 600 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని చూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















