Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
Kuldeep Yadav Marriage: భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ నెగ్గి భారత జట్టులో కుల్దీప్ సభ్యుడి తెలిసిందే.

ముస్సోరి: టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు అయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికా చద్దాను శనివారం రాత్రి వివాహం చేసుకున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలోని హోటల్ సవోయ్‌లో వారి వివాహం జరిగింది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో కుల్దీప్ సభ్యుడని తెలిసిందే. చైనామన్ బౌలర్ కుల్దీప్ గుర్రంపై ఊరేగింపుగా వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. డోలు వాయిద్యాల మధ్య అతని స్నేహితులు, సన్నిహిత బంధువులు డ్యాన్సు చేస్తూ కనిపించారు.

మార్చి 12న మొదలైన వేడుకలు
క్రికెటర్ కుల్దీప్ యాదవ్, వంశికా చద్దా వివాహ వేడుకలు మార్చి 12వ తేదీన ప్రారంభమయ్యాయి. కుల్దీప్ వివాహ వేడుకలో టీమిండియా క్రికెటర్లు పాల్గొని సందడి చేశారు. తిలక్ వర్మ, యుజ్వేంద్ర చాహల్, రింకు సింగ్, భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కూడా కుల్దీప్ పెళ్లి ఊరేగింపులో పాల్గొని అదరిపోయే స్టెప్పులేశారు.
#WATCH | Visuals from the wedding festivities of Indian cricket team's World Cup-winning star spinner Kuldeep Yadav and Vanshika in Mussoorie, Uttarakhand.
— ANI (@ANI) March 14, 2026
Kuldeep Yadav tied the knot with Vanshika in Mussoorie. pic.twitter.com/1TU1DINohT
కుల్దీప్ యాదవ్, వంశికా చద్దా వివాహం సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముస్సోరిలోని హోటల్ సవోయ్‌లోకి ఆహ్వానం అందుకున్న అతిథులను మాత్రమే అనుమతించారు. ఈ వివాహ వేడుకలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి కూడా పాల్గొన్నారు. కుల్దీప్ దంపతులు జగద్గురు రాంభద్రాచార్య నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. కుల్దీప్, వంశికా జంట చూడముచ్చటగా ఉంది. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The wedding of Kuldeep Yadav and his wife Vanshika was completed today in Mussoorie. 💐❤️ pic.twitter.com/RINuOfd3JV
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 14, 2026
Kuldeep Yadav and his wife made a grand entry at their wedding ceremony.🙌❤️
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 14, 2026
Congratulations both of you 💐 pic.twitter.com/dpXGZp4sDO
కుల్దీప్, వంశికా చద్దా జూన్ 4, 2025న యూపీలోని లక్నోలో నిశ్చితార్థం చేసుకున్నారని తెలిసిందే. అదే ఏడాది వివాహం చేసుకోవాలని మొదట ప్లాన్ చేసుకున్నారు. అయితే, కుల్దీప్ యాదవ్ క్రికెట్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉండటం వల్ల వివాహాన్ని కొంతకాలం వాయిదా వేశారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ ముగియడంతో కుల్దీప్ యాదవ్ వివాహ ఏర్పాట్లో బిజీ అయ్యాడు. ఈ క్రమంలో శనివారం నాడు ఓ శుభముహూర్తాన వంశికా మెడలో మూడు ముళ్లు వేసి ఏడు అడుగుల బంధంతో ఒక్కటయ్యారు.
```
ట్రెండింగ్ వార్తలు
















