Indian Cricketers Marriage: 2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
Indian cricketers marrried in 2026 | టీ20 వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడైన కుల్దీప్ యాదవ్ మార్చి 14న తన ప్రేయసి వంశికా చద్దాను వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు.

Kuldeep Yadav Vanshika Marriage: టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ మార్చి 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. 31 ఏళ్ల కుల్దీప్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికా చద్దాను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. వారి వివాహ వేడుక ఉత్తరాఖండ్ మసూరిలోని ప్రతిష్టాత్మక హోటల్ సవోయ్ లో జరిగింది. కుల్దీప్ పెళ్లి వేడుకల్లో తిలక్ వర్మ, చాహల్ మహ్మద్ కైఫ్ వంటి క్రికెట్ ప్రముఖులు పాల్గొన్నారు.
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తో పాటు రింకు సింగ్ తనకు కాబోయే భార్య (నిశ్చితార్థం చేసుకున్న) ప్రియా సరోజ్‌తో కలిసి కుల్దీప్, వంశికా వివాహానికి హాజరయ్యారు. మార్చి 17న లక్నోలో కుల్దీప్, వంశికాల రిసెప్షన్ గ్రాండ్‌గా జరగనుందని సమాచారం. ఈ ఈవెంట్‌కు క్రికెట్, రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
గత కొన్ని రోజులుగా కుల్దీప్ యాదవ్ చాలా సంతోషంగా ఉన్నాడు. కొన్ని రోజుల కిందట భారత్ T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఇండియా ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును 96 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఈ సంవత్సరం కుల్దీప్ మాత్రమే కాదు మరో క్రికెటర్ వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.
రెండో వివాహం చేసుకున్న శిఖర్ ధావన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఈ సంవత్సరం వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 21న తన ఐరిష్ గాళ్ ఫ్రెండ్ సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నాడు. కాగా, ఇది గబ్బర్‌కు రెండవ వివాహం. శిఖర్, సోఫీ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో మొదటిసారిగా వీరు జంటగా కనిపించారు.
మే 2025లో సోషల్ మీడియా ద్వారా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు అంగీకరించాడు. దాదాపు 9 నెలల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శిఖర్ మొదటి భార్య పేరు అయేషా ముఖర్జీ. 2012లో అయేషా, ధావన్ వివాహం చేసుకున్నారు. వారికి సంతానం జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. పదేళ్ల తరువాత అక్టోబర్ 5, 2023న శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ విడాకులు తీసుకున్నారు. అయితే అంతకు కొన్నేళ్లముందు నుంచే వీరు మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు.
రింకూ సింగ్ కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం చేసుకున్నాడు. అతడికి కాబోయే భార్య ప్రియా సరోజ్ లోక్‌సభ సభ్యురాలు కావడం విశేషం. అయితే టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్ కారణంగా పెళ్లి కొన్ని రోజులు వాయిదా వేసుకున్నాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో అనారోగ్యంతో రింకూ సింగ్ తండ్రి కన్నుమూశారని తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు

















