MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
ఐపీఎల్ పండుగ మొదలైపోయింది. టీమిండియా క్రికెటర్లంతా జట్లుగా విడిపోయి..ఇంటర్నేషనల్ క్రికెటర్లతో కలిసి సందడి చేసే సమయం ఆసన్నమైంది. ఇలాంటి టైమ్ లో మూడు జట్లపై మాత్రం ఎప్పట్లానే అభిమానుల దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్స్ ఫ్యాన్స్ మాత్రం సోషళ్ మీడియాలో ఫుల్ జోష్ లో ఉంటారు. దీనికి రీజన్ రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ కి త్రిమూర్తులు లాంటి ఈ ముగ్గురు టీమ్ మేట్స్ తో చేసే సరదాలు, వాళ్ల మూమెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి. అలాంటిదే నిన్న సీఎస్కే విషయంలో జరిగింది. టీమ్ ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా ఎంఎస్ ధోని తన బ్యాట్ కి క్రాఫ్టింగ్ చేసుకుంటున్న ఓ చిన్న పాటి వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కార్పెంటర్ ధోని అంటూ 12 గంటల్లో 28 మిలియన్స్ మంది ఆ రీల్ ను చూశారు. సీఎస్కే మిగిలిన రీల్స్ కి వచ్చిన వ్యూస్...ఆ రీల్ కి వచ్చిన వ్యూస్ చూస్తే చాలు అర్థమైపోద్ది..అది మాహీ కి ఇన్నేళ్లుగా ఫ్యాన్స్ లో తగ్గకుండా ఉన్న క్రేజ్ అని. ప్రాక్టీస్ సెషన్స్ లో యంగ్ ప్లేయర్స్ తో సరదాగా ఉంటూ తన 43వ ఏట కూడా ఐపీఎల్ ఆడేస్తున్న మాహీ...ఈ సీజన్ తో ఆపుతాడో లేదో క్లారిటీ లేదు కానీ తన ప్రతీ మూమెంట్ ను ఫ్యాన్స్ మాత్రం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేయటం మాత్రం మానటం లేదు అనటానికి కార్పెంటర్ ధోని రీలే ఉదాహరణ.
ట్రెండింగ్ వార్తలు





















