OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Pawan Kalyan OG 2 : మ్యూజిక్ లెజెండ్ తమన్ పవన్ కల్యాణ్ ఓజీ సీక్వెల్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. 'మళ్లీ మీసం తిప్పాలి కదా' అనే డైలాగ్‌తో భారీ హైప్ క్రియేట్ చేశారు.

Thaman Opens Up About Pawan Kalyan OG Sequel : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మ్యూజిక్ లెజెండ్ తమన్. ఓజీ సీక్వెల్ ఆలస్యం అవుతుందనే ప్రచారం నేపథ్యంలో దానిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'మీసం తిప్పాలి కదా'
'OG 2' ఈ సెప్టెంబరులో ట్రాక్ ఎక్కనున్నట్లు చెప్పారు తమన్. గతంలోనూ ఆయన ఇదే విషయాన్ని తెలిపారు. అయితే, రీసెంట్‌గా OG సీక్వెల్‌కు బ్రేక్ పడిందన్న వార్తల నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ఈవెంట్‌లో ఓజీ, ఓజీ అంటూ ఆడియన్స్ నినాదాలు చేయగా... 'సరే సరే ఫస్ట్ పీజీ తర్వాత ఓజీ. ఆగస్టులోనే ఉన్నా సెప్టెంబరుకు వస్తాం. అందుకే గడ్డం, మీసం పెంచుకుంటున్నా. మళ్లీ మీసం తిప్పాలి కదా.' అంటూ హైప్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
September lo #OG2 - #SSThaman in #KoreanKanakaraju pre-release event. pic.twitter.com/iV2t5HdNNl
— CineAura (@CineAuraX) August 4, 2026
Also Read : Oh Sukumari OTT : ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
OG సీక్వెల్ స్టోరీపై ఇప్పటికే పవన్, డైరెక్టర్ సుజీత్ చర్చలు జరిపారు. ఫైనల్ స్క్రిప్ట్‌పై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవలే పవన్ కుడిభుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ఆయన చేతికి బ్యాండేజ్‌తోనే పాలనా కార్యక్రమాలు చూస్తున్నారు. త్వరలో పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్‌లో పాల్గొనే ఛాన్స్ ఉందని ఫిలింనగర్ వర్గాల టాక్. సెప్టెంబరులో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
గతేడాది సెప్టెంబరులో వచ్చిన పవన్ OG బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. సుజీత్ దర్శకత్వం వహించగా... ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ క్లైమాక్స్‌లోనే సీక్వెల్, ప్రీక్వెల్‌తో పాటు OG యూనివర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై DVV దానయ్య నిర్మించారు. అయితే, సీక్వెల్‌కు నిర్మాత మారనున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సీక్వెల్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు























