అన్వేషించండి

Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్

Udhayanidhi Stalin: త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టు అయిన తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టులో ఊరట లభించడంతో జైలు నుంచి రాత్రి విడుదలయ్యారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • త్రిష వ్యాఖ్యల కేసులో ఉదయనిధి అరెస్టు, బెయిల్‌పై విడుదల.
  • సీఎం విజయ్ డైవర్షన్ రాజకీయాలపై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేశారు.
  • రైతుల కోసం భయం లేకుండా వందసార్లు మాట్లాడతానని ప్రతిజ్ఞ.

చెన్నై: సినీ నటి త్రిష, సీఎం విజయ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన డీఎంకేకు చెందిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. తాను ఏ తప్పు మాట్లాడలేదని, ఎవరికీ భయపడడని.. మళ్లీ మళ్లీ మాట్లాడతా అన్నారు. తన అరెస్ట్ పెద్ద కామెడీ అంటూ సెటైర్లు వేశారు. త్రిష గురించి డబుల్ మీనింగ్‌గా మాట్లాడారన్న ఆరోపణలపై మంగళవారం ఉదయం పోలీసులు ఉధయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం చెన్నై నుండి తంజావూరుకు తీసుకెళ్లారు. హైకోర్టుకు వెళ్లగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణ ముగిసిన తరువాత వదిలేస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. సుదీర్ఘంగా విచారణ చేసిన పోలీసులు ఉదయనిధి స్టాలిన్‌ను విడుదల చేశారు.

నా మాటలు కట్ కాపీ పేస్ట్ చేశారు..

తిరుచ్చి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్.. తాను మాట్లాడని విషయాలను కట్ కాపీ పేస్ట్ చేసి మార్చి మార్చి ప్రసారం చేశారని ఆరోపించారు. తాను మాట్లాడని విషయాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపించారు. తాను ఎలాంటి డబుల్ మీనింగ్ కామెంట్లు చేయలేదని, ఒకే అర్థంలో మాట్లాడానని స్పష్టం చేశారు. తన అరెస్ట్ వాస్తవానికి ఓ కామెడీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అరెస్టు చర్యలకు భయపడకుండా, మళ్లీ రైతుల కోసం మాట్లాడతానని తెలిపారు.

విజయ్ డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇది భాగమే..

విజయ్ టీవీకే ప్రభుత్వం డైవర్షన్ ట్యాక్టిక్స్ మొదలుపెట్టిందని, అందులో భాగంగానే పూర్తిగా అబద్ధపు వార్తలనే ప్రసారం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఉదయనిధి ఆరోపించారు.  నిన్న మాట్లాడేటప్పుడే తాను ఈ విషయం చెప్పానని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు, దానిని దారి మళ్లించడానికి ఏదో ఒక సమస్యను తీసుకుని సీఎం విజయ్ ఫోటో షూట్ చేస్తారని ఎద్దేవా చేశారు.

Also Read: Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 

డీఎంకే పథకాలను సందర్శించి, పోజు ఇచ్చి దానిని రీల్స్‌గా విడుదల చేయడంలో టీవీకే ప్రభుత్వం బిజీగా ఉందని ఉదయనిధి ఆరోపించారు. టీవీకే (TVK) నిర్వాహకులే తమ శాసనసభ సభ్యులపై అనేక నేరాలకు సంబంధించిన ఆరోపణలు చేసినప్పటికీ, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, డీఎంకే నేతల్ని టార్గెట్ ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.

భయపడను, మళ్లీ మాట్లాడతాను..
రైతుల కోసం మాట్లాడినందుకు ఈ ప్రభుత్వం తనను అరెస్టు చేసిందన్నారు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ అరెస్టుకు భయపడను. ఇంకా 100 సార్లు మళ్లీ మళ్లీ మాట్లాడతాను. డబుల్ మీనింగ్‌లో మాట్లాడలేదు. సింగిల్ మీనింగ్‌లో మాట్లాడాను అన్నారు. తమిళనాడులోని ప్రతి మహిళను తన సొంత తల్లిగా, సోదరిగా భావిస్తానని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ప్రభుత్వం మోపిన అబద్ధపు కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తన మాటలను పూర్తిగా వినకుండా ఖండించిన నాయకుల తీరుపై విచారం వ్యక్తం చేస్తూ, రైతుల శ్రేయస్సు కోసం ఎన్నిసార్లయినా మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

అసలు వివాదం ఏంటీ..

కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన ఈ ఆందోళనలో ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి విజయ్‌ను తీవ్రంగా విమర్శించారు. అయితే, సీఎంపై వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆందోళనకారులు నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉదయనిధి కావేరీ నీటిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు డబుల్ మీనింగ్ ఉన్నాయంటూ దుమారం రేగింది. దీనిపై టీవీకే (TVK) శ్రేణులు మండిపడ్డాయి. ఉదయనిధి మహిళలను కించపరిచేలా వ్యవహరించారని ఆయన వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Frequently Asked Questions

ఉదయనిధి స్టాలిన్ ఎందుకు అరెస్ట్ అయ్యారు?

సినీ నటి త్రిష, సీఎం విజయ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం చెన్నై నుండి తంజావూరుకు తీసుకెళ్లి విచారించారు.

తన అరెస్టుపై ఉదయనిధి స్టాలిన్ స్పందన ఏమిటి?

తన అరెస్టు పెద్ద కామెడీ అని, తాను తప్పుగా మాట్లాడలేదని అన్నారు. మళ్లీ మళ్లీ మాట్లాడతానని, రైతుల కోసం భయపడకుండా పోరాడతానని స్పష్టం చేశారు.

తాను చేసిన వ్యాఖ్యల గురించి ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు?

తాను ఎలాంటి డబుల్ మీనింగ్ కామెంట్లు చేయలేదని, ఒకే అర్థంలో మాట్లాడానని స్పష్టం చేశారు. తన మాటలను కట్ కాపీ పేస్ట్ చేసి మార్చారని ఆరోపించారు.

టీవీకే ప్రభుత్వంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి అబద్ధపు వార్తలు ప్రసారం చేస్తోందని, డీఎంకే నేతలను లక్ష్యంగా చేసుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Embed widget