అన్వేషించండి

Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!

Indhanpally Forest Range Officer Suspended: ఆదివాసీలపై దాడి చేసిన అటవీ అధికారిపై వేటు పడింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో ఇంధన్‌పల్లి రేంజ్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.

Indiramma Houses Sand Transport Forest Issue:  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ పరిధిలో గిరిజనులు, అటవీశాఖ అధికారుల మధ్య కొన్నిరోజులుగా రగులుతున్న తీవ్ర వివాదం చివరకు అధికారులపై వేటుతో కీలక మలుపు తిరిగింది. అటవీశాఖ అధికారులు తమ తీరు మార్చుకోకపోతే ఖానాపూర్ నియోజకవర్గంలోనే వారికి వ్యతిరేకంగా ఒక  వ్యతిరేక సామ్రాజ్యం  ఏర్పాటు చేస్తామని, సహాయ నిరాకరణ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేసిన సంచలన హెచ్చరికలు ఫలించాయి. ఆదివాసీలపై దాడి చేసిన ఇంధన్‌పల్లి అటవీ శాఖ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వివాదానికి ప్రధాన కేంద్రంగా మారిన మంచిర్యాల జిల్లా జన్నారంలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అటవీశాఖ వైఖరిపై విరుచుకుపడ్డారు. గిరిజనులపై ప్ర  చేయి చేసుకున్న ఇంధన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణతో పాటు తపాలాపూర్, ఉడుంపూర్, ఖానాపూర్ రేంజ్ అధికారులపైనా తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ పేరిట నిబంధనలను సాకుగా చూపిస్తూ అటవీ సిబ్బంది సాగిస్తున్న వేధింపులను ఇకపై సహించేది లేదని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.

అటవీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే వ్యక్తంచేసిన తీవ్ర ఆగ్రహం ఏజెన్సీలో ప్రజా ఆగ్రహానికి అద్దం పట్టింది.  అటవీ ప్రాంతంలోకి స్థానిక గిరిజనులను రానివ్వని అధికారులు.. మరి గ్రామీణ ప్రాంతాల్లోని రెవెన్యూ భూముల్లోకి ఎలా వస్తారు  అని ఆయన సూటిగా నిలదీశారు. కనీసం నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, కంకరను కూడా తెచ్చుకోకుండా అధికారులు అడ్డుపడటం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గిరిజన పల్లెలకు చేరకుండా అటవీ నియమావళి పేరిట అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే హెచ్చరికలతో పాటు అఖిలపక్ష నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు సహాయ నిరాకరణ ఉద్యమానికి సిద్ధమవుతుండటంతో అటవీ ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. బాధ్యుడైన రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణపై విచారణకు ఆదేశించి, ప్రాథమిక ఆధారాల ఆధారంగా ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉడుంపూర్, తపాలాపూర్ ప్రాంతాల్లో గిరిజనులతో ఏర్పడిన ఘర్షణ పూరిత వాతావరణాన్ని చక్కదిద్దేందుకు, రెవెన్యూ ప్రాజెక్టులకు ఇబ్బంది కలగకుండా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

అధికారులపై చర్యలతో జన్నారం, ఖానాపూర్ ప్రాంతాల్లో ఉద్రిక్తత కొంత మేర సడలినప్పటికీ.. కవ్వాల్ టైగర్ జోన్ సరిహద్దు గ్రామాల్లోని గిరిజనుల పొడు భూములు, మౌలిక వసతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. జన్నారం సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు నందు నాయక్, మేకల మాణిక్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఇతర కుల సంఘాల నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

                  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget