అన్వేషించండి

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి.  గోదావరి శాంతించింది. కృష్ణానదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు; హైదరాబాద్‌లో కుండపోత వాన.
  • గోదావరి వరద తగ్గగా, కృష్ణా నది ప్రవాహం పెరుగుతోంది.
  • శ్రీశైలం జలాశయానికి భారీ ప్రవాహం; పది రోజుల్లో నిండే అవకాశం.

Andhra Pradesh And Telangana Weather: వాతావరణ శాఖ చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వానలు హడలెత్తించినా మిగతా ప్రాంతాల్లో మాత్రం జల్లులు ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఆనందాన్ని అందిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఇప్పుడు అవి కూడా శాంతించాయి. 

హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన 

హైదరాబాద్‌ నగరంలో సోమవారం సాయంత్రం, రాత్రి కుండపోత వాన కురిసింది. కేవలం కొన్ని గంటల్లోనే సరూర్‌నగర్‌ ఉప్పల్‌, మాధాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌ బీభత్సం సృష్టించింది. దీని వల్ల రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. 

తెలంగాణలో తేలికపాటి వానలు

తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. సిరిసిల్ల, సిద్ధిపేట, కామారెడ్డి, మెదక్‌, హనుమకొండ, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, నల్గొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుల వాన

ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాలు అయిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచించారు.   

గోదావరికి తగ్గిన వరద 

గోదావరి కొన్ని రోజుల పాటు ఉగ్రరూపంతో భయపెట్టింది. కానీ ఇప్పుడు శాంతిస్తుండగా, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ రాయలసీమ ప్రాజెక్టుల వైపు పరుగులు తీస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్ట ఒక దశలో 55.90 అడుగులకు చేరింది. దీని వల్ల సుమారు 15,84,657 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగింది. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వాలు తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఎగువన వర్షాలు తగ్గడంతో గోదారమ్మ శాంతిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం భారీగా తగ్గడంతో వేలేరుపాటు, కుక్కునూరు, మండలాల్లో వరద తగ్గుముఖం పట్టింది. వరద నీటిలో మునిగిపోయిన రహదారులు బయట పడుతుండటంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి.

కృష్ణలో పెరుగుతున్న వరద 

గోదావరి తగ్గుతున్నా, కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. రాయలసీమకు గుండెకాయ వంటి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేరటర్‌ వద్దకు కృష్ణమ్మ పరుగులు పెడుతూ చేరుకుంది. శ్రీశైలం జలాశయంలోకి జూరాల నుంచి 1.71 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటి మట్టం 854.5 అడుగులకు చేరింది. 

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న రైతులకు ఈ వర్షాలు వరదలు కాస్త ఊరటనిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.81టీఎంసీలు కాగా, ప్రస్తుతం 92.04 టీఎంసీలు నీరు ఉంది. ఇే వేగంతో వరద కొనసాగితే పది రోజుల్లో శ్రీశైలం నిండే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర జలాశయానికి కూడా ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల 13,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది రుతుపవనాలు నెమ్మదించాయి. జూలై ఆరంభంలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, నెలాఖరుకు వచ్చేసరికి ఉద్ధృతి పెరిగింది. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీరు శ్రీశైలం వంటి ప్రాజెక్టులు నిండటం సాగు నీటి అవసరాలకు సానుకూల అంశం.

Frequently Asked Questions

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది?

వాతావరణ శాఖ చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడినా, మిగతా చోట్ల జల్లులు ప్రజలకు, రైతులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్రధాన నదులు శాంతించాయి.

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఎలాంటి ప్రభావం కలిగింది?

సోమవారం సాయంత్రం, రాత్రి హైదరాబాద్‌లో కుండపోత వాన కురిసింది. సరూర్‌నగర్‌, ఉప్పల్‌ వంటి ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా నదుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ఇప్పుడు శాంతిస్తోంది, భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గింది. కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద వస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల పట్ల ఎలాంటి హెచ్చరికలు జారీ చేయబడ్డాయి?

ఆంధ్రప్రదేశ్‌లో చాలా జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget